Rashikhanna : ఆ ఒక్కటి అడక్కు.. అంటున్న హీరోయిన్ రాశీ ఖన్నా ..!

- Advertisement -

Rashikhanna : ఢిల్లీ బ్యూటీ రాశీ ఖన్నా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. నాగశౌర్యతో కలిసి ‘ఊహలు గుస గుసలాడే’ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది ఈ అమ్మడు. టాలీవుడ్, కోలీవుడ్ అనే తేడా సినిమాలు చేస్తున్నప్పటికీ అనుకున్నంత స్టార్ డమ్ మాత్రం దక్కడం లేదు. ముద్దుగా, బొద్దుగా, అందంగా ఉండే ఈ బ్యూటీ గ్లామరస్ పాత్రల్లో నటిస్తూ కుర్రాళ్లను మెప్పించింది. కారణం ఏంటో తెలియదు కానీ సినిమా హిట్ అయిన రాశీకి మాత్రం కలిసి రావడం లేదు. ఇక తెలుగులో 2022 వ సంవత్సరంలో ‘థాంక్యూ, తిరు, సర్దార్’ వంటి సినిమాల్లో నటించింది రాశీ ఖన్నా. ఆ తర్వాత మళ్లీ ఇప్పటి వరకు ఇంకో సినిమా ప్రకటించలేదు.

ఇక రెండేళ్ల గ్యాప్ తర్వాత ‘అరణ్మణై 4’ తో త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. హారర్ మూవీగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి సుందర్ దర్శకత్వం వహించాడు. ఇక ఇందులో సుందర్ హీరోగా నటించగా.. రాశీ ఖన్నాతో పాటు తమన్నా భాటియా, ఖుష్బు ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు. ఈ చిత్రం ఏప్రిల్ 26 థియేటర్లో విడుదలకు సిద్ధంగా ఉంది. దీంతో సినిమా యూనిట్ ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నారు. ఈ క్రమంలో తన పెళ్లిపై ఎదురైన ఓ ప్రశ్నకు చాలా తెలివిగా ఆన్సర్ ఇవ్వకుండా ఎస్కేప్ అయింది.

- Advertisement -

మొదట రాశీ ఖన్నా ‘అరణ్మణై 4’ గురించి మాట్లాడుతూ.. ‘ఈ చిత్రంలో మంచి పాత్ర వచ్చింది. ఈ సినిమా నాకు గుర్తింపు తెచ్చిపెడుతుందని నమ్మకంగా ఉంది’ అని చెప్పుకొస్తూనే.. నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్రల్లో నటించి మంచి పేరు తెచ్చుకోవాలని కోరికగా ఉంది. బాహుబలి లాంటి చిత్రంలో నటించి తన సత్తా చాటుకోవాలని ఉందని తెలిపింది. ఇక అంతా బాగానే ఉంది కానీ, మీరు పెళ్లి ఎప్పుడు చేసుకుంటారు అని ప్రశ్నించగా.. ఆ ఒక్కటి అడగొద్దంటూ తెలివిగా తప్పించుకుంది రాశీ ఖన్నా.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here