Rajinikanth : ఆ హీరోతో రొమాన్స్ చేసానని రజినీకాంత్ నాకు టార్చర్ చూపించాడు అంటూ హీరోయిన్ రంభ షాకింగ్ కామెంట్స్!

- Advertisement -

Rajinikanth : అచ్చ తెలుగు అమ్మాయిగా తెలుగు సినిమా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టి పాన్ ఇండియన్ స్టార్ హీరోయిన్ గా ఎదిగిన వారిలో ఒకరు రంభ. ఒక దశాబ్ద కాలం ఈమె ఇండస్ట్రీ ని ఒక ఊపు ఊపింది అనే చెప్పాలి. ప్రతీ స్టార్ హీరో, స్టార్ డైరెక్టర్ రంభ డేట్స్ కోసం క్యూలు కట్టేవారు. తెలుగు, తమిళం, హిందీ, మలయాళం, కన్నడ ఇలా అన్నీ భాషల్లో అక్కడ ఉన్న సూపర్ స్టార్స్ తో కలిసి ఈమె సినిమాలు చేసింది.

తమిళం లో ఈమె రజినీకాంత్ తో కలిసి ‘అరుణాచలం’ అనే చిత్రం చేసింది. ఈ సినిమా అప్పట్లో తమిళం లోనే కాదు, తెలుగు లో కూడా పెద్ద హిట్. ఈ చిత్రం లో రంభ సెకండ్ హీరోయిన్ గా నటించింది. అప్పటికే సౌత్ లో అగ్ర స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్నప్పటికీ కూడా రంభ కేవలం రజినీకాంత్ సినిమాలో కనిపించే అవకాశం వచ్చిందని ఒప్పుకొని చేసింది.

ఈ సినిమా షూటింగ్ జరుగుతున్నప్పుడు రజినీకాంత్ తో జరిగిన ఒక సంఘటన గురించి చెప్పుకొచ్చింది రంభ. ఆమె మాట్లాడుతూ ‘అప్పట్లో నేను అరుణాచలం సినిమా షూటింగ్ చేస్తున్న సమయం లోనే సల్మాన్ ఖాన్ తో బంధన్ అనే సినిమా షూటింగ్ లో కూడా పాల్గొనాల్సి వచ్చింది. రెండు సినిమాల షూటింగ్స్ పక్కపక్కనే జరుగుతూ ఉండడం తో పగలు పూట అరుణాచలం షూటింగ్, ఆ తర్వాత మధ్యాహ్నం నుండి బంధన్ మూవీ షూటింగ్ లో పాల్గొనేదానిని. ఒకరోజు అరుణాచలం షూటింగ్ లొకేషన్ కి సల్మాన్ ఖాన్ వచ్చాడు. ఆయన రాగానే నేను వెళ్లి హాగ్ చేసుకున్నాను. ఇది దూరం నుండి చూసిన రజినీకాంత్ హర్ట్ అయ్యి వెళ్ళిపోయాడు. అనంతరం ఆయన దగ్గరకి నేను వెళ్లగా, నాతో చాలా కోపం గా ప్రవర్తించి , మేడలో ఉన్న తుండుని విసిరేసి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. నేను ఏడ్చేసాను,నేనేం పాపం చేశాను, నా మీద ఎందుకు అంత కోపం అని రజిని సార్ ని అడగగా, అప్పుడు రజిని మాట్లాడుతూ మాకు అయితే షూటింగ్ లో కేవలం షేక్ హ్యాండ్ ఇస్తావ్, వేరే హీరోకి అయితే హగ్గులు ఇస్తావు అంటూ ఆటపట్టించారు’ అని చెప్పుకొచ్చింది రంభ.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here