Heroine Rambha తెలుగు సినిమా ఇండస్ట్రీ లో ఎవర్ గ్రీన్ హీరోయిన్స్ లిస్ట్ తీస్తే అందులో రంభ లేకుండా మాత్రం ఉండదు.విజయవాడ కి చెందిన ఈ తెలుగమ్మాయి ఆరోజుల్లో సౌత్ ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ ని ఏలింది.అద్భుతమైన అందం తో పాటు నటన , డ్యాన్స్ తో కుర్రకారులో సెగ రేపింది.ప్రస్తుతం టాలీవుడ్ లో శ్రీ లీల ఎలా అయితే యూత్ లో సెన్సేషన్ గా మారిందో,ఆ రోజుల్లో రంభ కూడా అలా అన్నమాట.ఈమె తెలుగు, హిందీ , తమిళం మరియు మలయాళం బాషలలో దాదాపుగా అందరి స్టార్ హీరోల సరసన నటించింది, ఒక్క అక్కినేని నాగార్జున తో తప్ప.ఆరోజుల్లో వీళ్లిద్దరు కలిసి నటించకపోవడానికి చాలా కారణాలు ఉన్నాయంటూ ప్రత్యేక కథనాలు వచ్చాయి, కానీ అసలు స్టోరీ మాత్రం వేరే ఉంది, ఇది చాలా మందికి తెలియని విషయం గా పరిగణించొచ్చు.
ఇక అసలు విషయానికి వస్తే అప్పట్లో ఈవీవీ సత్యనారాయణ తెరకెక్కించిన ‘హలో బ్రదర్’ అనే చిత్రాన్ని మనం ఎలా మర్చిపోగలము..?, అప్పట్లో ఈ చిత్రం సృష్టించిన సెన్సేషన్ మామూలుది కాదు.ఆరోజుల్లోనే సుమారుగా పది కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టింది ఈ చిత్రం.అయితే ఈ సినిమాలో హీరోయిన్స్ గా రమ్య కృష్ణ మరియు సౌందర్య నటించిన సంగతి అందరికీ తెలిసిందే.అయితే రమ్య కృష్ణ కంటే ముందుగా ఆ పాత్ర కోసం రంభ ని అనుకున్నాడట డైరెక్టర్ ఈవీవీ సత్యనారాయణ.ఆమెతో మాట్లాడి డేట్స్ కూడా రప్పించుకున్నాడు, కానీ నాగార్జున మాత్రం నాకు రమ్య కృష్ణనే కావాలని పట్టుబట్టాడు అట,దీనితో తప్పనిసరి పరిస్థితి లో రంభ ని తప్పించాల్సి వచ్చిందట.
రంభ ని తెలుగు సినిమా ఇండస్ట్రీ కి పరిచయం చేసిందే ఈవీవీ సత్యనారాయణ, ఆయన అడిగితే ఎన్ని డేట్స్ అయినా ఇవ్వడానికి సిద్ధంగా ఉంటుంది రంభ.ఈ చిత్రానికి డేట్స్ అడగగానే రెండు సినిమాలను పక్కకి నెట్టి మరీ డేట్స్ ఇచ్చిందట, కానీ చివరి నిమిషం లో మార్చేసరికి నాగార్జున మీద చాలా కోపం తెచ్చుకుందట రంభ.కానీ ఈవీవీ సత్యనారాయణ రిక్వెస్ట్ గా అడగడం తో అదే సినిమాలో ఒక పాటలో కనిపించింది.అంతే ఆ తర్వాత ఇక అక్కినేని నాగార్జున తో సినిమాలు చెయ్యకూడదు అనే నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తుంది.అందుకే వీళ్లిద్దరి కాంబినేషన్ లో ఒక్క సినిమా కూడా రాలేదని అంటుంటారు.