Keerthy Suresh : ఈ కాలం లో మహానటి సావిత్రి , జమున మరియు సౌందర్య వంటి నటనకి ప్రాముఖ్యం ఇచ్చే హీరోయిన్లను చూడలేము.ఎందుకంటే ఇప్పుడు నటనకంటే ఎక్కువగా అందాల ఆరబోతలకే మన దర్శక నిర్మాతలు ప్రాధాన్యత చూపిస్తున్నారు.మరోపక్క అవకాశాలు రాక చతికిలపడిన హీరోయిన్లు కూడా మళ్ళీ తిరిగి అవకాశాలను సంపాదించుకునేందుకు ఇంస్టాగ్రామ్ మరియు ట్విట్టర్ వంటి సోషల్ మీడియా మాధ్యమాలలో పొట్టి పొట్టి దుస్తులను ధరించి,అందాలను ఆరబోస్తూ అవకాశాలు ఇలా అయినా వస్తాయేమో అని ఆశపడుతున్నారు.
ఇప్పుడు ఆ జాబితాలోకి కీర్తి సురేష్ కూడా వెళ్లిపోయిందా అనే సందేహాలు అభిమానుల్లో మొదలయ్యాయి.’నేను శైలజా’ అనే సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన కీర్తి సురేష్, ఆ తర్వాత వరుసగా అవకాశాలను దక్కించుకుంటూ అతి తక్కువ సమయం లోనే స్టార్ హీరోయిన్ గా ఎదిగిపోయింది.ముఖ్యంగా ఆమె ప్రధాన పాత్రలో తెరకెక్కిన ‘మహానటి’ అనే చిత్రం ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిల్చిందో అందరికీ తెలిసిందే.
మహానటి సావిత్రి గా ఆమె నటించిన అద్భుతమైన నటనకు గాను ఉత్తమ నటిగా నేషనల్ అవార్డు కూడా దక్కింది.అంతటి గౌరవాన్ని దక్కించుకున్న కీర్తి సురేష్ కి టాలీవుడ్ లో పెద్దగా అవకాశాలు రావడం లేదు.సూపర్ స్టార్ మహేష్ బాబు తో ‘సర్కారు వారి పాట’ సినిమా చేసిన తర్వాత ఆమె చేతిలో కేవలం నాని ‘దసరా’, మెగాస్టార్ చిరంజీవి ‘భోళా శంకర్’ వంటి సినిమాలు మాత్రమే ఉన్నాయి.ఈ రెండు సినిమాలు మినహా టాలీవుడ్ లో మరో సినిమా లేదు.
దీనితో ఆమె అవకాశాల కోసం తన ఇంస్టాగ్రామ్ అకౌంట్ ద్వారా అభిమానులకు అందాల విందు పంచుతూ అప్లోడ్ చేస్తున్న ఫోటోలు సోషల్ మీడియా లో వైరల్ గా మారాయి.ఒకప్పుడు సాంప్రదాయ బద్దంగా చక్కగా చీర , లంగాఓణీతో కనిపించిన కీర్తి సురేష్ నేనా ఇప్పుడు మనం చూస్తున్నది అని అభిమానులు సైతం ఆశ్చర్యపొయ్యే రేంజ్ ఫోటోలను అప్లోడ్ చేస్తుంది.ఇలా అవకాశాల కోసం నేషనల్ అవార్డుని గెల్చుకున్న ఒక హీరోయిన్ లో ఇలాంటి మార్పులు రావడం చూసి అభిమానులు పెదవి విరుస్తున్నారు.ఆ ఫోటోలను మీరు కూడా చూసేయండి.