మెకానిక్ తో కీర్తి సురేష్ రొమాన్స్.. మండిపడుతున్న అభిమానులు

- Advertisement -

సౌత్ ఇండియా లో మంచి డిమాండ్ ఉన్న హీరోయిన్స్ లిస్ట్ తీస్తే అందులో కీర్తి సురేష్ పేరు కచ్చితంగా ఉంటుంది. అందం తో పాటుగా అద్భుతమైన అభినయం కూడా చూపించే అతి తక్కువ మంది హీరోయిన్స్ లో ఒకరు ఈమె. ఇంత కాలం నుండి సినిమాలు చేస్తున్నా కూడా ఏ చిత్రంలోనూ మితిమీరిన రొమాన్స్ , మరియు హాట్ సన్నివేశాలలో నటించలేదు. కేవలం నటనకి ప్రాధాన్యత ఉన్న పాత్రలే పోషిస్తూ వచ్చింది.

Keerthi suresh
Keerthi suresh

మహానటి సినిమాలో అద్భుతమైన నటన కనబర్చినందుకు గాను ఆమెకి ఉత్తమనటి క్యాటగిరీ లో నేషనల్ అవార్డు కూడా వచ్చింది. నేటి తరం స్టార్ హీరోయిన్స్ లో ఎవరికీ కూడా జాతీయ అవార్డు రాలేదు. ఆ స్థాయికి చేరుకున్నా కూడా కీర్తి సురేష్ ఏనాడు కూడా తాను పెద్ద హీరోయిన్ ని అనే బడాయి చూపించలేదు. సెట్స్ లో జూనియర్ ఆర్టిస్టుతో కూడా ఆమె ఎంతో స్నేహంగా ఉంటుంది.

రీసెంట్ గా ఆమె షూటింగ్ లొకేషన్ లో ఉండే ఒక మెకానిక్ తో ఫోటో దిగింది, ఆ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ గా మారింది. ఎవరైనా తెలియని వ్యక్తితో హీరోయిన్స్ క్లోజ్ గా ఉంటె వాళ్ళ మధ్య ఎదో రిలేషన్ ఉంది అన్నట్టుగా ప్రాజెక్ట్ చేసే కొంతమంది నెటిజెన్స్, ఈ ఫోటో ని అప్లోడ్ చేస్తూ కీర్తి సురేష్ లవర్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

- Advertisement -

దీని పై అభిమానులు మండిపడుతున్నారు, సెట్స్ లో ఎవరితో అయినా ఒక్క ఫోటో దిగితే వాళ్లకు సంబంధం అంటగట్టేస్తారా?, అసలు ఇలా ఎలా ఆలోచిస్తున్నారు అంటూ కామెంట్ చేస్తున్నారు కీర్తి సురేష్ ఫ్యాన్స్. ఇక కీర్తి సురేష్ ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి తో ‘భోళా శంకర్’ చిత్రం లో నటిస్తుంది. ఈ సినిమాలో ఆమె చిరంజీవి కి చెల్లెలుగా నటిస్తుంది , ఈ చిత్రం ఆగస్టు 11 వ తేదీన విడుదల కాబోతుంది. దసరా మూవీ తో సూపర్ హిట్ ని అందుకొని మంచి ఊపు మీదున్న కీర్తి సురేష్ ఈ సినిమాతో కూడా సక్సెస్ అందుకుంటుందా లేదా అనేది చూడాలి.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

   
vps230225.betterwebtechnologies.com telugucinematoday.com