Heroine Kasthuri : కథానాయిక కస్తూరి అనగానే అందరికి ముందుగా గుర్తుకు వచ్చే చిత్రం ‘భారతీయుడు’. ఓ ఇంటర్వ్యూలో కస్తూరి సినిమా గురించి మాట్లాడారు. ‘ప్రేమికుడు’ సినిమా హిట్ అవ్వగానే అందరూ డైరెక్టర్ శంకర్ గురించే మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. ఆయన సినిమాలో అవకాశం వస్తే బాగుంటుందని అనుకున్నాను. ఆయన సినిమా ‘భారతీయుడు’ నుంచి నాకు కాల్ వస్తుందని కూడా అనుకోలేదు. “శంకర్ డైరెక్షన్.. రెహమాన్ సంగీతం.. కమల్ హాసన్ హీరోగా ఇలాంటి సినిమాలో అవకాశం వస్తే ఎవరికైనా అలాగే అనిపించేది.. కమల్ హాసన్ గురించి ఏం చెప్పాలి.. ఆయన గురించి ఎంత చెప్పినా తక్కువే. అది తక్కువ అవుతుంది. ఆ సినిమా చేసినప్పటి కంటే ఆ తర్వాత నాకు ఎక్కువ అదృష్టం కలిగింది.
తెలుగులో ‘అన్నమయ్య’ లాంటి సినిమా చేస్తానని నేనెప్పుడూ ఊహించలేదు. ‘‘నేను స్కూల్లో చదువుకునే రోజుల నుంచి కూడా నాగార్జునగారు అంటే నాకు ఎంతో ఇష్టం. ఆ రోజుల్లోనే నాగార్జునగారిని ఒకసారి కలిశాను. అప్పుడు ఆయన ఏ షర్టు వేసుకున్నదీ ఇప్పటికీ నాకు అలా గుర్తుండిపోయింది. ఆయనకి నేను షేక్ హ్యాండ్ ఇచ్చాను. ఆయన టచ్ చేసిన చేతితో నేను ఏమీ తాకకుండా స్కూల్ కి వెళ్లి మా ఫ్రెండ్స్ కి చూపించాను. నాగార్జునగారు టచ్ చేసిన చేయి అంటూ అంతా టచ్ చేసేవారు. నాగార్జునగారు అంటే ఇప్పటికీ నాకు అదే ఇష్టం ఉందని తెలిపింది. ఆయనపై అభిమానం ఎప్పటికీ పోదు అంటూ వ్యాఖ్యలు చేసింది. అన్నమయ్య సినిమా నా జీవితంలో ఎప్పటికి మరచిపోలేనని తెలిపింది. ఇప్పటికి ఆసాంగ్ , ఆనతో పాటు చేసిన నటన నా జీవితంలో ఒక డ్రీమ్ లా అనిపిస్తూ ఉంటుంది. అన్నమయ్య సినిమా చేసేప్పుడు ఆయన చాలా సాప్ట్ గా అందరితో కలిసిపోయేవారంటూ ఆమె చెప్పింది. ఇప్పుడు కస్తూరి చెప్పిన మాటలు తెగ వైరల్ అవుతున్నాయి. ఏంటి కస్తూరి నాగ్ అంటే నీకు అంత ఇష్టమా.. మన్మధుడంటే ఇష్టపడని వారుంటారా? అంటూ కామెంట్లు చేస్తున్నారు.