Ileana D’Cruz: వాళ్ల కారణంగానే ఇండస్ట్రీకి దూరమయ్యా ఇలియానా సంచలన వ్యాఖ్యలు

- Advertisement -

Ileana D’Cruz: తెలుగు సినీ ప్రేక్షకులకు ఇలియానా గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. హీరో రామ్ సరసన దేవదాస్ అనే సినిమాతో హీరోయిన్ గా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది ఈ ముద్దుగుమ్మ. అద్భుతమైన అందం, చలాకీ నటనతో అతి తక్కువ సమయంలోనే తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంది. సన్నజాజిలాంటి తన నడుముంపు అందాలతో తెలుగు ప్రేక్షకులను చూపు తిప్పుకోకుండా ఫిదా చేసేసింది. తన కొంటె చూపులతో ఎంతోమంది కుర్రకారు మనసుల్లో అందాల దేవతగా నిలిచిపోయింది. తక్కువ సమయంలోనే స్టార్ హీరోల సినిమాల్లో అవకాశాలు దక్కించుకొని ఎన్నో సూపర్ హిట్లను తన ఖాతాలో వేసుకుంది.

ఇండస్ట్రీలో దాదాపు పదేళ్ల పాటు స్టార్ హీరోయిన్ గా తన హవా నడిపించింది. కానీ ఆ తర్వాత తర్వాత మాత్రం ఈ అమ్మడికి అవకాశాలు ఒక్కసారిగా రావడం తగ్గిపోయాయి. దీంతో బాలీవుడ్ లో పాగా వేయాలని ట్రై చేసింది. అనుకున్నట్లు గానే అక్కడ అవకాశాలు తలుపు తట్టాయి. కానీ ఎందుకో అక్కడ అదృష్టం కలిసి రాలేదు. దీంతో రవితేజ సరసన అమర్ అక్బర్ ఆంటోనీ సినిమాతో తెలుగులోకి రీఎంట్రీ ఇచ్చిన ప్రేక్షకుల నుంచి మాత్రం ఆదరణ కరువైంది. ఎందుకంటే సన్నజాజిలా ఉన్న ఈ ముద్దుగుమ్మ.. బొద్దుగా మారిపోయింది. దీంతో లావుగా మారిన ఇలియానాను జనాలు చూడలేకపోయారు.

- Advertisement -


ఇక ప్రేమలో మునిగిపోవడం.. తర్వాత లవ్ బ్రేకప్ తో డిప్రెషన్ లోకి వెళ్లిపోవడం.. పెళ్లి కాకుండానే బిడ్డను కనడం ఇలా తరచూ వార్తల్లోనే నిలుస్తూ వచ్చింది ఇలియానా. ఇటీవలే తన కెరీర్ గురించి సంచలన వ్యాఖ్యలు చేసింది. ఇండస్ట్రీలో తనకు రావలసిన గుర్తింపు రాలేదని వాపోయింది. అందుకు కారణం కూడా తెలియదంటూ ఆవేదన వ్యక్తం చేసింది. బర్ఫీ సినిమాలో నటించాక సౌత్ ఇండస్ట్రీ నుంచి నాకు ఆఫర్లు రాలేదు. అక్కడ నిర్మాతలు, దర్శకులు.. నేను బాలీవుడ్ లో సెటిల్ అయ్యానని అనుకున్నారు. మంచి స్క్రిప్టు దొరికితే నేను ఎక్కడైనా నటించడానికి రెడీగా ఉన్నాను. కానీ నాకు అవకాశాలు ఇవ్వడానికి ఎవరూ ముందుకు రావడం లేదంటూ చెప్పుకొచ్చింది ఈ నాజుకు నడుము సుందరి.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here