అల్లు అర్జున్ హీరోగా వచ్చిన దేశముదురు సినిమాతో ప్రేక్షకులకు దగ్గరై టాలీవుడ్ ని ఓ ఊపు ఊపేసింది హన్సిక. తన అందచందాలతో యాపిల్ పిల్లగా యూత్ ఆడియన్స్ ని బుట్టలో వేసుకుంది. తెలుగు తెరపై తన లేలేత అందాలతో కనువిందు చేసి సూపర్ ఫ్యాన్ బేస్ కూడగట్టుకుంది హన్సిక (Hansika). ప్రస్తుతం తెలుగులో ఈ భామకు పూర్తిగా అవకాశాలు తగ్గాయి.
ఇటీవల వైవాహిక బంధంలోకి అడుగుపెట్టిన ఆమె తాజాగా తన తదుపరి చిత్రాల ప్రమోషన్స్ కోసం సిద్ధమయ్యారు. ఈ క్రమంలోనే తాజాగా ఓ ఆంగ్ల ఎంటర్‌టైన్‌మెంట్ వెబ్‌సైట్‌కు ఆమె ఇంటర్వ్యూ ఇచ్చారు. ఇందులో తన కెరీర్ ఎలా మొదలైందో చెప్పారు. ‘ఇండస్ట్రీ లోకి హీరోయిన్ గా వచ్చిన కొత్తల్లో చాలా అవామనాలను ఎదురుకున్నాను.అప్పట్లో నేను ఏదైనా ఫంక్షన్ కి వెళ్ళాలి అనుకుంటే ,ఈ మోడల్ లో నాకు బట్టలు చేయిస్తారా అని డిజైనర్స్ ని రిక్వెస్ట్ చేసేదానిని.కానీ వాళ్ళు కుదరదు అని మొహం మీదనే చెప్పేసేవాళ్ళు, అప్పుడు నాకు చాలా బాధ వేసేది.ఆరోజుల్లో నాకు డిజైనర్ బట్టలు ఇవ్వను అన్నవాళ్ళే ఇప్పుడు నాకోసం డిజైనర్లు గా పనిచేయడానికి ఎగబడుతున్నారు’ అంటూ చెప్పుకొచ్చింది.
‘‘ఎనిమిదేళ్లకే బాలనటిగా పరిశ్రమలోకి అడుగుపెట్టిన నేను ‘దేశముదురు’తో దక్షిణాదిలో గుర్తింపు తెచ్చుకున్నాను. ఆ సినిమా తర్వాత సౌత్‌లో తెరకెక్కిన ఎన్నో సినిమాల్లో నటించాను. త్వరలో నేను నటించిన ఏడు సినిమాలు / సిరీస్‌లు ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమయ్యాయి’’ అని చెప్పింది. ఇక, డిజైనర్ దుస్తుల గురించి విజయ్ వర్మ సైతం ఇటీవల స్పందించిన విషయం తెలిసిందే. విజయ్ వర్మ చేసిన వ్యాఖ్యలు మర్చిపోక ముందే హన్సిక సైతం తనతో డిజైనర్లు వ్యవహరించిన తీరును బయటపెట్టారు. దక్షిణాది సినిమాలకు ఆదరణ పెరగడంతో ఇప్పుడు డిజైనర్లు సైతం ఇక్కడి వాళ్లకు దుస్తులు సిద్ధం చేయడానికి అంగీకరిస్తున్నారని ఆమె వెల్లడించింది.