మెహర్ రమేష్ లేకపోతే నాకు జీవితమే ఉండేది కాదు అంటూ హీరోయిన్ హన్సిక షాకింగ్ కామెంట్స్

- Advertisement -

బాలనటిగా కెరీర్ ని ప్రారంభించి ఆ తర్వాత హీరోయిన్ గా అడుగుపెట్టి వరుస బ్లాక్ బస్టర్ హిట్స్ ని అందుకొని అనతి కాలం లోనే స్టార్ హీరోయిన్ గా ఎదిగిన నటి హన్సిక. ఈమె సౌత్ లో దాదాపుగా అందరి స్టార్ హీరోల సరసన నటించింది. ఈమె మొదటి సినిమా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ మరియు పూరి జగన్నాథ్ కాంబినేషన్ లో వచ్చిన ‘దేశ ముదురు’ చిత్రం అప్పుడు ఆమె వయస్సు కేవలం 16 సంవత్సరాలు మాత్రమే.

హన్సిక
హన్సిక

అంత చిన్న వయస్సులోనే హీరోయిన్ గా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన హన్సిక, ఆ సినిమా సూపర్ హిట్ అవ్వడం తో మళ్ళీ ఆమె వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. హిట్టు మీద హిట్టు కొడుతూ చూస్తూ ఉండగానే ఎవ్వరూ అందుకోలేని రేంజ్ కి చేరిపోయింది. ఈమె తొలిసినిమా తెలుగు లోనే, కానీ ఎక్కువ గా తమిళ సినిమాల్లోనే హీరోయిన్ గా నటించింది. సక్సెస్ రేషియో కూడా ఆమెకి అక్కడే ఎక్కువ ఉంది.

Hansika

ఇది ఇలా ఉండగా రీసెంట్ గానే జరిగిన ఒక ఇంటర్వ్యూ లో తన మొదటి సినిమా దేశముదురు కి సంబంధించిన కొన్ని జ్ఞాపకాలను గుర్తు చేసుకుంది. యాంకర్ హన్సిక ని ఒక ప్రశ్న అడుగుతూ, ‘అతి చిన్న వయస్సులోనే మీరు ఈ స్థాయికి వచ్చారు కదా,మీకు ఎలా అనిపిస్తుంది?’ అని అడిగిన ప్రశ్నకి హన్సిక సమాధానం చెప్తూ ‘అది నా అదృష్టం, దేశముదురు సినిమా సమయానికి నాకు 16 సంవత్సరాలు మాత్రమే నిండాయి, ఇంకా 17 వ సంవత్సరం లోకి కూడా అడుగుపెట్టలేదు. కానీ నాకు అప్పటికీ నా సొంత డబ్బులతో కారు కొనుక్కోగలిగాను, ఇల్లు కట్టుకున్నాను’ అని చెప్పుకొచ్చింది.

- Advertisement -
Actress Hansika

ఇక దేశముదురు సినిమాలో అవకాశం ఎలా వచ్చిందో చెప్పుకుంటూ ‘ఈ సినిమాలో నాకు అవకాశం మెహర్ రమేష్ వల్లే వచ్చింది. ఆయన లేకపోతే నా జీవితం ఈరోజు ఇలా ఉండేది కాదు, పూరి సార్ అప్పుడే తన సినిమాలో హీరోయిన్స్ కోసం కొత్తవాళ్ళని ఆడిషన్ చెయ్యాలనే ఆలోచనలో ఉన్నాడు. కానీ మెహర్ రమేష్ ఈ అమ్మాయి చైల్డ్ ఆర్టిస్టుగా చాలా చక్కగా చేసింది సార్, మన సినిమాకి పెర్ఫెక్టుగా ఉంటుంది అనడం తో ఫోటో షూట్ చేసి వెంటనే తన సినిమాలో తీసేసుకున్నాడు’ అని చెప్పుకొచ్చింది హన్సిక.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here