Esther : సినిమా ఇండస్ట్రీలో పరిచయాలు, స్నేహాలు, ప్రేమలు, పెళ్లిళ్లు, విడాకులు సర్వసాధారణం. కొంతమంది పెళ్లి చేసుకుని ఆదర్శ దంపతులుగా నిలుస్తుంటే.. మరికొందరైతే పెళ్లయిన మూణ్నాళ్లకే విడిపోతున్నారు. చిన్న గొడవలకే.. మనస్పర్థల కారణంగా విడాకుల వరకు వెళ్తున్నారు. పిల్లలున్నారనన్న విషయం కూడా మర్చిపోయి క్షణికావేశంలో కోర్టు మెట్లు ఎక్కుతున్నారు. అలాంటి వారిలో నోయెల్ సీన్- ఎస్తేర్ కపుల్ ఒకటి.
ఎస్తేర్ నోరోన్హా అందరికి సుపరిచితమే. ‘1000 అబద్దాలు’ ‘భీమవరం బుల్లోడు’ వంటి సినిమాల్లో నటించింది. కానీ సినిమాల్లో తనకు పెద్దగా హీరోయిన్ గా కలిసి రాలేదు. దీంతో సింగర్ నోయెల్ పెళ్లి చేసుకుంది. అయితే పెళ్ళైన కొంతకాలానికే వీరిద్దరూ విడాకులు తీసుకుని విడివిడిగా బతుకుతున్నారు. అటు తర్వాత ఎస్తేర్ .. పలు సినిమాల్లో కీలకపాత్రలు చేస్తూ వస్తోంది. అలాగే ఇంకా కొన్ని సినిమాల్లో బోల్డ్ రోల్స్ కూడా చేస్తూ కుర్రాళ్లకు కునుకు లేకుండా చేస్తోంది.
తాజాగా ఎస్తర్ ఓ ఇంటర్వ్యూకు హాజరైన ఆమె తన భర్తపై షాకింగ్ కామెంట్స్ చేసింది. ‘‘నోయల్ నాతో విడిపోయాక నాపై చెడు ప్రచారం చేశాడు. బిగ్ బాస్ హౌస్‌లో జనాలు అతడిపై సింపతి చూపించేలా మా విడాకుల ఇష్యూను తీసుకొచ్చాడు. ప్రేక్షకుల్లో సానుభూతి పొందాడు. దీంతో జనాలంతా నాదే తప్పు అని భావించారు. నాపై చాలామంది దారుణమైన ట్రోల్స్ చేశారు. ఓ పర్సన్ ఎవరో తెలియదు కానీ హైదరాబాదు వస్తే అక్కడ యాసిడ్ పోస్తానంటూ బెదిరిస్తూ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టాడు. కానీ మా మధ్య ఏం జరిగిందో నాకు తెలుసు. పెళ్లైన 16 రోజులకే గొడవలు మా మధ్య స్టార్ట్ అయ్యాయి. అతడితో టార్చర్ అనుభవించా’’ అంటూ ఆమె చెప్పుకొచ్చింది.