బాలికా వధు అనే హిందీ సీరియల్‌తో బాలనటిగా గుర్తింపు తెచ్చుకుంది అవికాగోర్. తెలుగులోకి ఆ సీరియల్‌ని చిన్నారి పెళ్లి కూతురుగా డబ్బింగ్ చేస్తే ఇక్కడ ప్రజలు గొప్పగా ఆదరించారు. ఆ సీరియల్‌తో పాపులర్ అయిన నటి తర్వాత ఉయ్యాలా జంపాలా, సినిమా చూపిస్త మావ, రాజుగారి గది 3.. వంటి పలు చిత్రాల్లో నటించి మెప్పించింది. రీసెంట్‌గా పాప్ కార్న్ అనే సినిమాలో హీరోయిన్‌గా నటిస్తూనే నిర్మాతగానూ మారింది అవికాగోర్. అయితే ఆ సినిమా ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేదు. ప్రస్తుతం బాలీవుడ్ వైపు వెళ్లిన ఆమె వెబ్‌సిరీస్‌లు చేస్తూ ఉంది.

ఆమె నటించిన చిత్రాల్లో కొన్ని భారీ స్థాయిలో హిట్ అవ్వగా మరికొన్ని చిత్రాలు ప్లాప్ అయ్యాయి. కాగా సినిమాల్లో అవకాశాలు లభించినప్పటికీ హీరోయిన్‌గా కంటే సీరియల్‌లోని భారీ స్థాయి పాపులాటి దక్కించుకోలేకపోయింది. తాజాగా ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె సీరియల్‌లో తనకున్న అనుభవాల గురించి కొన్ని విషయాలు పంచుకుంది. ఓ సీరియల్‌కు సంబంధించిన విషయాన్ని తెలుపుతూ తెగ నవ్వుకుంది. అయితే గతంలో నటించిన సీరియల్‌లో ఏకంగా అవికాగోర్కి ఒకసారి కాదు రెండు సార్లు కాదు ఏడు సార్లు పెళ్లి చేశారట. అయితే అందులో మూడు సార్లు హీరోతో చేయడం.. ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్‌తో చేయడం.. ఇక చివరగా మూడు సార్లు చనిపోయినట్టు నటించమన్నారని అవికా చెప్పింది. ఆ తర్వాత ఆత్మతో మాట్లాడుతున్నట్లు నటించమన్నారంటూ అవికా తన వింత అనుభవాన్ని వివరించింది. ఆ సమయంలో నాకు చాలా నవ్వొచ్చిందని చెప్పుకొచ్చింది.

ఇక ఇదే ఇంటర్వ్యూలో ఆమె నెపోటిజంపై చేసిన వ్యాఖ్యలు విమర్శలకు గురైన విషయం తెలిసిందే. దక్షిణాదిన నెపోటిజం ఎక్కువగా ఉంటుందని చెప్తూ సంచలన వ్యాఖ్యలు చేసింది అవికాగోర్. సౌత్‌లో స్టార్స్ మీదే సినిమాలన్నీ నడుస్తుంటాయన్న ఆమె, సౌత్ లో నెపోటిజం చాలా ఎక్కువగా ఉంటుందని చెప్పింది. బాలీవుడ్‌లో అంత వివక్ష ఉండదని తెలుగు పరిశ్రమలో ఇది ఎక్కువగా ఉంటుందని చెప్పారు. ఇక సౌత్‌లో మరి ముఖ్యంగా తెలుగులో చాలా ఎక్కువే ఉంది అంటూ ఘాటుగా స్పందించింది. దీంతో ఆమెపై నెట్టింట విమర్శలు గుప్పుమంటున్నాయి.