Actress Anjali : అచ్చ తెలుగు అమ్మాయిగా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన వారిలో ఒకరు అంజలి. చూడచక్కని రూపంతో పాటుగా, సహజమైన నటన ఈమె సొంతం. అందుకే తెలుగు లో చేసింది కొన్ని సినిమాలే అయ్యినప్పటికీ కూడా ఎప్పటికీ మర్చిపోలేని క్యారెక్టర్స్ ని చేసింది అంజలి. ఇప్పటి వరకు ఆమె చేసిన సినిమాల లిస్ట్ ఒక్కసారి చూస్తే, ప్రతీ సినిమాలోనూ ఆమె తన పాత్ర ప్రాధాన్యం ఉన్న వాటినే ఎంచుకుంది అని అనే విషయం అర్థం అవుతుంది.
అంతే కాకుండా ప్రతీ ఒక్కరికి ఈమె మన ఇంటి అమ్మాయి అనే ఫీలింగ్ ని రప్పించింది అంజలి. కేవలం టాలీవుడ్ కి మాత్రమే పరిమితం అవ్వకుండా, ఇతర భాషల్లో కూడా సినిమాలు చేస్తూ ఫుల్ బిజీ గా గడుపుతున్న ఈ తెలుగు అమ్మాయి, ఇప్పుడు గీతాంజలి 2 తో మన ముందుకు రాబోతుంది. ఈమె ప్రధాన పాత్రలో తెరకెక్కిన ‘గీతాంజలి’ చిత్రం అప్పట్లో ఎంత పెద్ద హిట్ అయ్యిందో మన అందరికీ తెలిసిందే.
ఇప్పుడు ఆ సినిమాకి కొనసాగింపుగా ఈ సీక్వెల్ తెరకెక్కింది. ఈ సందర్భంగా అతి త్వరలో విడుదల అవ్వబోతున్న ఈ సినిమా కోసం రీసెంట్ గా మూవీ టీం ఒక ప్రెస్ మీట్ ని ఏర్పాటు చేసింది. ఈ ప్రెస్ మీట్ లో ఒక మీడియా రిపోర్టర్ అంజలి కి చిరాకు కలిగించే ప్రశ్నలను అడిగింది. ముందుగా ఆ రిపోర్టర్ మాట్లాడుతూ ‘అంజలి గారు..నేను మీకు పెద్ద ఫ్యాన్ ని,కానీ తెలుగు అమ్మాయిగా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన మీరు, అనుకున్న రేంజ్ సక్సెస్ కాలేకపోయారు అనిపించింది’ అని అంటుంది.
అప్పుడు అంజలి వెంటనే మైక్ అందుకొని ‘నేను సక్సెస్ కాకపోతే మీరు నా ఫ్యాన్ అయ్యేవారు కాదు’ అని బదులిస్తుంది. అప్పుడు ఆ రిపోర్టర్ మాట్లాడుతూ ‘అలా కాదండి,ఇప్పుడు శ్రీలీల గారికి ఇండస్ట్రీ లో అవకాశాల మీద అవకాశాలు వస్తున్నాయి, అలాంటి ఊపు మీకు రాలేదు అనేది నా అభిప్రాయం’ అని అంటుంది. అప్పుడు అంజలి మాట్లాడుతూ ‘నాకు ఈ నెంబర్ 1 , నెంబర్ 2 వంటి గేమ్స్ మీద నమ్మకం లేదు. నేను ఒక భాషలో కాదు, ఒకేసారి నాలుగైదు భాషల్లో నటిస్తున్నాను, కాబట్టి సత్తా లేని సినిమాలను పది ఒప్పుకోవడం కంటే, మంచి కంటెంట్ ఉన్న సినిమాని ఒక్కటి ఒప్పుకోవడం ఎంతో బెటర్, అందుకే నేను సెలెక్టివ్ గా సినిమాలు చేసుకుంటూ పోతున్నాను’ అని సమాధానం ఇచ్చింది.