కొత్త కారు కొన్న యశ్.. ధర తెలిసి షాక్ అవుతున్న నెటిజన్లు

- Advertisement -

KGF స్టార్ యశ్.. ఒకే ఒక్క సినిమాతో పాన్ ఇండియా హీరోగా మారిపోయాడు. డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శత్వంలో వచ్చిన కేజీఎఫ్ సిరీస్ ఎంతటి ఘన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. దాంతో ఒక్కసారిగా హీరో యశ్ పాన్ ఇండియా సూపర్ స్టార్ గా మారిపోయాడు. ఇక తాజాగా వార్తల్లో నిలిచాడు రాకీ భాయ్. దానికి కారణం అతడు ఓ లగ్జరీ కారును కొనుగోలు చేయడమే. దాని ధరతో ఓ రేంజ్ మూవీనే తీయెుచ్చు అంటే అతిశయోక్తికాదేమో. ఇంతకీ రాకీ బాయ్ కొన్న ఆ కారు ధర ఎంతో? ఇప్పుడు తెలుసుకుందాం.

రాఖీ బాయ్ య‌శ్‌.. త‌న గ్యారేజ్ లోకి మ‌రో ల‌గ్జ‌రీ కారుకు వెల్క‌మ్ చెప్పాడు. రేంజ్ రోవర్ కారును యశ్ తాజాగా కొనుగోలు చేశారు. అంతేకాదు త‌న కొత్త కారుతో భార్య రాధిక పండిట్‌, పిల్లలు యథర్వ్‌, ఐరాతో కలిసి ఫోటోల‌కు పోజులిచ్చింది. ప్ర‌స్తుతం ఈ పిక్స్ నెట్టింట వైర‌ల్ గా మారాయి. ఇక‌పోతే రాఖీ బాయ్ కొత్త కారు ధ‌ర ఓంతో తెలిస్తే దిమ్మ‌తిరుగుద్ది. ఎందుకంటే.. య‌శ్ కొనుగోలు చేసిన ఈ రేంజ్ రోవర్ కారు ధర రూ. 4 కోట్లు. అన్ని సౌక‌ర్యాల‌తో అత్యంత విలాస‌వంతంగా ఈ కారు ఉంటుంద‌ట. ఈ కారు ఫీచ‌ర్స్ య‌శ్ ను ఎంత‌గానో ఆక‌ట్టుకున్నాయ‌ట‌. అందుకే లేట్ చేయ‌కుండా త‌న గ్యారేజ్ లోకి తెచ్చిపెట్టుకున్న‌ట్లు తెలుస్తోంది.

ఈ రేంజ్ రోవర్ ఫీచర్స్ ఏంటంటే.. 13.7 ఇంచుల డిజిటల్ ఇన్ స్ట్రుమెంట్ క్లస్టర్ తో పాటుగా.. 13.1 అంగుళాల టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్ మెంట్ డిస్ ప్లేను కలిగిఉంది. వెనక కూర్చునే వారికి 11.4 అంగుళాల వినోద ప్రదర్శన కూడా ఆస్వాదించవచ్చు. ఇది ముందు, వెనక సీట్ లకు జోడించి వచ్చింది. వీటితో పాటుగా మరెన్నో కొత్త ఫీచర్లను కలిగి ఉంది ఈ రేంజ్ రోవర్. ఇక ఈ కారు ముందు తన భార్యా, పిల్లలతో దిగిన ఫొటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారాయి.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here