Venu : ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ సపోర్టు లేకుండా కేవలం తాను నమ్ముకున్న టాలెంట్ తో ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టి టాప్ స్టార్ గా ఎదిగిన హీరో వేణు తొట్టెంపూడి. ‘స్వయంవరం’ సినిమాతో ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన వేణు,తొలి సినిమానే భారీ బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడం తో వరుసగా అద్భుతమైన సినిమాలలో హీరో గా నటించే ఛాన్స్ దక్కింది.

‘చిరు నవ్వుతో’, ‘హనుమాన్ జంక్షన్’, ‘చెప్పవే చిరుగాలి’,’కల్యాణ రాముడు’, ‘పెళ్ళాం ఊరెళితే’, ‘గోపి గోపిక గోదావరి’, ఇలా ఎన్నో సూపర్ హిట్ సినిమాలలో హీరో గా నటించి, ప్రేక్షకుల మదిలో తనకంటూ ఒక ప్రత్యేకమైన బ్రాండ్ ఇమేజి ని ఏర్పాటు చేసుకున్నాడు. అయితే 2013 వ సంవత్సరం నుండి సినిమాలకు బాగా గ్యాప్ ఇచ్చిన వేణు తొట్టెం పూడి రీసెంట్ గా రవితేజ హీరో గా నటించిన ‘రామారావు ఆన్ డ్యూటీ’ సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చాడు. ఈ సినిమా తర్వాత ఆయన హాట్ స్టార్ లో ‘అతిధి’ అనే సినిమా కూడా చేసాడు.

ఈ సినిమా ప్రొమోషన్స్ లో భాగంగా వేణు ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ లో ఎవరికీ తెలియని కొన్ని ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నాడు. ఆయన మాట్లాడుతూ కొంత కాలం సినిమాలకు గ్యాప్ ఇవ్వాలని అనుకున్నప్పుడు బోయపాటి శ్రీను గారు నా దగ్గరకి వచ్చారు. ఇలా ఎన్టీఆర్ తో ఒక సినిమా చేస్తున్నాను, అందులో నీకు అదిరిపోయే రేంజ్ పాత్ర ఉంది, షోలే సినిమాలో అమితాబ్ బచ్చన్ పాత్ర ఎలా ఉంటుందో, ఈ సినిమాలో నీది ఆ రేంజ్ పాత్ర అని చెప్పాడు.
సినిమాకి ఓకే చేసే ముందు తారక్ కి కూడా ఫోన్ చేశాను, చేసేయండి అన్నా, మీతో కలిసి నటించాలని ఉంది అని అన్నాడు. అలా కథ కూడా పూర్తిగా వినకుండా వెంటనే ఓకే చెప్పేసాను. కానీ సినిమా చూసిన తర్వాత చాలా బాధపడ్డాను, నా పాత్రకి అసలు ప్రాముఖ్యతే లేదు. కథ ఇదే అని నాకు ముందే తెలిసి ఉంటే అసలు సినిమాని ఒప్పుకునేవాడిని కాదు అంటూ చెప్పుకొచ్చాడు.
