తరుణ్ బాలనటుడిగా తెలుగు మరియు తమిళం బాషలలో ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి, ఆ తర్వాత హీరో గా కూడా స్టార్ గా ఎదిగిన నటులలో ఒకడు తరుణ్.’నువ్వేకావాలి’ సినిమాతో ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన తరుణ్, తొలిసినిమా తోనే ఇండస్ట్రీ హిట్ అందుకున్నాడు. ఆ తర్వాత ‘ప్రియమైన నీకు’, ‘నువ్వు లేక నేను లేను’, ‘నువ్వే నువ్వే’, ‘ఎలా చెప్పను’ ఇలా ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించి యూత్ లో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు.

ముఖ్యంగా లేడీస్ లో తరుణ్ కి ఉన్న క్రేజ్ మామూలుది కాదు.కేవలం తెలుగు లో మాత్రమే కాదు, తమిళం లో కూడా ఆయనకీ సూపర్ హిట్ సినిమాలు ఉన్నాయి, అంతటి రేంజ్ కి వెళ్లిన తరుణ్ కెరీర్ అకస్మాత్తుగా డౌన్ ఐపోవడానికి కారణం ఆయన తల్లి రోజారమణి అని ఎప్పటి నుండో సోషల్ మీడియా లో ఒక రూమర్ ఉండేది.

తరుణ్ ఎంచుకునే ప్రతీ సినిమా, రోజారమణి ఓకే చెప్తేనే ముందుకెళ్తుందని,అలా ఆమె ప్రమేయంతో మధ్యలో చాలా ఫ్లాప్ సినిమాలు వచ్చాయని టాక్. ఇదే విషయాన్నీ గతం లో తరుణ్ ని ఒక ఇంటర్వ్యూ లో అడిగితే ఆయన దానికి సమాధానం చెప్తూ ‘పెళ్లి చేసుకోని అబ్బాయిలు ఏ నిర్ణయం తీసుకోవాలన్నా వాళ్ళ అమ్మ నాన్నలతో చర్చించి తీసుకోవడం అనేది సర్వసాధరణం. నేను కూడా ఏదైనా సినిమా ఒప్పుకునే ముందు మా అమ్మ తో క్యాజువల్ గా చర్చించేవాడిని, అంతే తప్ప ఆమె ఈ సినిమా చెయ్యి, ఆ సినిమా చెయ్యొద్దు అంటూ బలవంతం ఏమీ పెట్టదు. చివరికి తుది నిర్ణయం తీసుకునేది నేనే, మా అమ్మ ప్రమేయం ఏమి ఉండదు’ అని చెప్పుకొచ్చాడు తరుణ్. ప్రస్తుతం ఆయన సినిమాలకు దూరంగా, వ్యాపార రంగం లో బిజీ గా గడుపుతున్నాడు.