Actor Surya : రాజమౌళి ఆఫర్ ని రిజెక్ట్ చేసిన హీరో సూర్య..ఏ సూపర్ స్టార్ కూడా ఇలా చెయ్యడు!

- Advertisement -

Actor Surya ఇండియా లో ప్రస్తుతం స్టార్ హీరోలను మించిన సూపర్ స్టార్ ఎవరైనా ఉన్నారా అంటే, అది డైరెక్టర్ రాజమౌళి మాత్రమే. మన ఇండియన్ సినిమా బాక్స్ ఆఫీస్ స్టామినా కి హద్దులు చెరిపేసి, హాలీవుడ్ స్థాయికి వెళ్లి ఆస్కార్ అవార్డుని గెలుచుకున్నాడు. అలాంటి రాజమౌళి సినిమాలో నటించడం ఇప్పుడు ఏ హీరో కి అయినా ఒక కల. ఆయన సినిమాలో చిన్న పాత్ర ఇచ్చిన చాలు, అని అనుకునే సూపర్ స్టార్స్ ఎంతోమంది ఉన్నారు. అలాంటి రాజమౌళి కి తమిళ హీరో సూర్య నో చెప్పారట. అదేంటి సూర్య ప్రస్తుతం బాక్స్ ఆఫీస్ పరంగా చాలా డీలా పడున్నాడు. ఇలాంటి సమయం లో రాజమౌళి ప్రాజెక్ట్ ఎలా రిజెక్ట్ చేసాడు అని మీరు అనుకోవచ్చు. కానీ ఈ సంఘటన జరిగి దాదాపుగా 20 ఏళ్ళు అయ్యింది.

Actor Surya
Actor Surya

పూర్తి వివరాల్లోకి వెళ్తే రాజమౌళి – నితిన్ కాంబినేషన్ లో వచ్చిన స్పోర్ట్స్ డ్రామా సై అప్పట్లో ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయ్యిందో మన అందరికీ తెలిసిందే. సరికొత్త రగ్బీ గేమ్ ని మన తెలుగు ఆడియన్స్ కి పరిచయం చేసి థ్రిల్ కి గురి చేసాడు. అయితే ఈ చిత్రం లో సెకండ్ హీరో రోల్ కోసం సూర్య ని అడిగాడట రాజమౌళి. దీనికి సూర్య చాలా సున్నితంగా రిజెక్ట్ చేసినట్టు తెలుస్తుంది. ఎందుకంటే సూర్య అప్పుడప్పుడే తమిళం లో ఎదుగుతున్న హీరో, అలాంటి సమయం లో సెకండ్ హీరో రోల్ చేస్తే హీరో అవకాశాలు తగ్గిపోతాయేమో అని భయంతో ఈ చిత్రాన్ని రిజెక్ట్ చేసాడట సూర్య.

Sye | Cinema Chaat

- Advertisement -

ఆ తర్వాత ఈ పాత్రని శశాంక్ చేసాడు. వాస్తవానికి ఈ చిత్రాన్ని రాజమౌళి ఒక మల్టీ స్టార్రర్ గా చెయ్యాలనే సూర్య ని కలిశారట. కానీ హీరో పాత్రతో పోలిస్తే కాస్త తక్కువే. అందుకే ఆయన ఒప్పుకోలేదని అంటుంటారు. ఇక సూర్య రిజెక్ట్ చేసిన తర్వాత కథలో కొన్ని మార్పులు చేసి పూర్తిగా సోలో హీరో సినిమాలాగా మార్చేశాడు రాజమౌళి. ఈ చిత్రం తర్వాత సూర్య ని హీరో గా పెట్టి ఒక సినిమా తియ్యాలనుకున్నాడు రాజమౌళి. కానీ ఎందుకో అది కార్యరూపం దాల్చలేదు. కానీ రీసెంట్ గా విడుదలైన రాజమౌళి #RRR చిత్రం లో ఎన్టీఆర్ పోషించిన కొమరం భీం పాత్ర ముందుగా సూర్య కి వచ్చిందట. కానీ ఎన్టీఆర్ ప్రత్యేకంగా ఈ క్యారక్టర్ కోరడం తో రాజమౌళి సూర్య ని తప్పించాల్సి వచ్చిందని అంటుంటారు. మళ్ళీ వీళ్లిద్దరి కాంబినేషన్ లో మూవీ ఎప్పుడొస్తుందో చూడాలి.

SS Rajamouli, Suriya team up for a bilingual - News18

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here