Actor Suhas : హీరో సుహాస్ పేరుకు పరిచయం అక్కర్లేదు. ఈ మధ్య బ్యాక్ టు బ్యాక్ హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకుంటూ, వరుస సినిమాలను లైన్లో పెడుతున్నాడు. రీసెంట్ గా అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.. ఆ సినిమా సూపర్ హిట్ అయ్యింది. థియేటర్లలో మాత్రమే కాదు. ఓటీటీలో కూడా దూసుకుపోతుంది.. ఇప్పుడు మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అవుతున్నాడు.

సుహాస్ గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒకటి సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతుంది. సుహాస్ ప్రస్తుతం ప్రసన్న వదనం సినిమాలో నటిస్తున్నాడు.. ఆ సినిమా టీజర్ ను రిలీజ్ చేశారు. ఈ సందర్బంగా టీజర్ లాంచ్ ఈవెంట్ ను ఏర్పాటు చేశారు. ఈ సందర్బంగా హీరో సుహాస్ మీడియాతో మాట్లాడాడు. మీడియా వారు అడిగిన ప్రశ్నలకు స్టైయిట్ గాసమాధానం చెప్పారు సుహాస్. అయితే ఒక విలేకరి ప్రశ్నిస్తూ.. తన రెమ్యునరేషన్ గురించి ప్రశ్నించారు. దానికి సమాధానమిస్తూ.. అవును పెంచాను నేను బ్రతకాలి కదా అంటూ ఘాటు రిప్లై ఇచ్చాడు.

జూనియర్ ఆర్టిస్ట్ గా రోజుకు 100 రూపాయలు తీసుకునే దగ్గర్నుంచి ఇప్పుడు హీరోగా కష్టపడి ఎదిగాను, ప్రతీ మెట్టులో నా కష్టం దాగి ఉంది. అలాంటిప్పుడు రెమ్యునరేషన్ పెంచడంలో తప్పులేదు అని అన్నారు. ప్రస్తుతం సుహాస్ మాటలు వైరల్ అవుతున్నాయి. మొత్తానికి రెమ్యూనరేషన్ పెంచారని అర్థమవుతుంది. కమెడియన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా అడుగు పెట్టిన సుహాస్. తన ఆటీట్యూడ్ తో, యాక్టింగ్ తో కట్టిపడేస్తున్నాడు. హీరోగా వచ్చిన ఒక్క అవకాశాలన్ని కరెక్ట్ గా ఉపమోగించుకున్న సుహాస్.. అంచలంచెలుగా ఎదుగుతున్నాడు. షార్ట్ ఫిలిం లో హీరోగా చేసిన ఆయన ఇప్పుడు హీరోగా వరుస సక్సెస్ లను తన ఖాతాలో వేసుకుంటున్నాడు.