Srikanth : అతను స్క్రీన్ మీద కనిపిస్తే చెప్పులతో కొడుతారు అంటూ హీరో శ్రీకాంత్ సంచలన వ్యాఖ్యలు

- Advertisement -

Srikanth : ఫ్యామిలీ ఆడియన్స్ లో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరోల లిస్ట్ తీస్తే అందులో శ్రీకాంత్ పేరు ముందు వరుసలో ఉంటుంది. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ ఇమేజి లేకుండా ఇండస్ట్రీ లోకి వచ్చి చిన్న చిన్న పాత్రలు పోషిస్తూ, ఆ తర్వాత హీరో గా ఎదిగి వంద సినిమాలకు పైగా చేసి, ఇప్పటికీ క్యారక్టర్ ఆర్టిస్టుగా మంచి డిమాండ్ తో కొనసాగుతున్న నటులలో ఒకడు ఆయన.

Srikanth
Srikanth

సాఫ్ట్ రోల్స్ కి కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిన శ్రీకాంత్ ని డైరెక్టర్ బోయపాటి శ్రీను ‘అఖండ’ చిత్రం లో విలన్ రోల్ లో చూపించి ఆడియన్స్ కి పెద్ద షాక్ ని ఇచ్చాడు. ఈ సినిమా తర్వాత హీరో శ్రీకాంత్ కెరీర్ వేరే లెవెల్ కి వెళ్ళింది. తెలుగు , కన్నడ, మలయాళం మరియు తమిళ ఇండస్ట్రీస్ లో పెద్ద పెద్ద సినిమాల్లో నటించే ఛాన్స్ దక్కింది.

ఇప్పుడు రీసెంట్ గా బోయపాటి శ్రీను హీరో రామ్ తో కలిసి చేసిన ‘స్కంద’ చిత్రం లో కూడా శ్రీకాంత్ ఒక ముఖ్యమైన పాత్ర పోషించాడు. ఈ సినిమాలో శ్రీకాంత్ పాత్ర పూర్తిగా ఎమోషనల్ గా ఉంటుంది అట. నిన్న ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ ని విడుదల చేసారు. ఈ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో శ్రీకాంత్ మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ గా మారాయి.

- Advertisement -

సినిమాలో పని చేసిన ప్రతీ ఒక్కరి గురించి ఆయన గొప్పగా మాట్లాడిన మాటలు బాగున్నాయి కానీ, చివర్లో థమన్ గురించి మాట్లాడుతూ కాస్త తడబడ్డాడు. ‘థమన్ అందించే పాటలు మరియు బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కి మన హీరోలను చూస్తే ఈలలు, చెప్పులు పడుతాయి’ అంటూ నోరు జారాడు. ఆ తర్వాత వెంటనే ‘చప్పట్లు పడుతాయి’ అంటూ సరి చేసుకున్నాడు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియా లో తెగ వైరల్ గా మారింది.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here