Siddharth : సెల్ఫీ అడిగిన అభిమాని పై మండిపడ్డ హీరో సిద్ధార్థ.. ఇంత యాటిట్యూడ్ అవసరమా బ్రో

- Advertisement -

Siddharth : కోలీవుడ్ స్టార్ హీరో సిద్దార్థ్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పని లేదు. ఆయనకు తమిళంతో పాటు తెలుగులోనూ ఫాలోయింగ్ ఉంది. ఆయన నటించిన సినిమాలు తెలుగులో కూడా విడుదల అవుతాయి. టాలీవుడ్ లో కూడా పలు సినిమాలు చేసి బ్లాక్ బస్టర్ హిట్లు అందుకున్నాడు. నువ్వొస్తానంటే నేనొద్దంటానా, చుక్కల్లో చంద్రుడు వంటి సినిమాలతో లవర్ బాయ్‌గా ఫుల్ పాపులారిటీ తెచ్చుకున్నాడు.. కొన్నేళ్ల పాటు ఇండస్ట్రీలో స్టార్ గా వెలుగొందాడు. కానీ గత కొద్ది కాలంగా కోలీవుడ్‌ కే పరిమితం అయి.. ఆక్కడ మాత్రమే సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నాడు.

Siddharth
Siddharth

చాన్నాళ్ల తర్వాత రీసెంటుగా సిద్దు చిన్నా సినిమాతో సూపర్ హిట్ అందుకున్నాడు. అదే ఫామ్‌లో ప్రస్తుతం కమల్ హాసన్ హీరోగా, అగ్ర దర్శకుడు శంకర్ కాంబోలో తెరకెక్కుతున్న ‘ఇండియన్-2’ లో కీలక పాత్రలో కనిపించనున్నాడు. ఇక సిద్దార్థ్ పర్సనల్ లైఫ్ విషయానికొస్తే.. యంగ్ బ్యూటీ అదితి రావు హైదరితో గత కొద్ది కాలంగా రిలేషన్ కొనసాగించి ఇటీవల గుడిలో రహస్యంగా పెళ్లి కూడా చేసుకున్నాడనే వార్తలు వచ్చాయి. ఆ తర్వాత వీరిద్దరు సోషల్ మీడియా వేదికగా తమ ప్రేమ విషయాన్ని బహిరంగంగా ప్రకటించారు. గుడిలో చేసుకుంది పెళ్లి కాదని కేవలం ఎంగేజ్‌మెంట్ మాత్రమే జరుపుకున్నామని తెలిపారు.

- Advertisement -

ఇదిలా ఉంటే.. తాజాగా, సిద్దార్థ్‌కు సంబంధించిన ఓ వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది. ముంబైలోని బాంద్రాకి వెళ్లి సందడి చేశాడు. అయితే అక్కడ ఓ అభిమాని సిద్దార్థ వెళ్తుండగా కారు వద్దకు వచ్చి సార్ ఫొటో అని అడిగాడు. దీంతో హీరో కోపంగా.. ‘‘దయచేసి ఇక్కడ సౌండ్ చేయకు బాస్ నాకు నచ్చదు. నీకు చెప్పాను కదా బాలేదని’’ అంటాడు. దీంతో అతను సారి చెప్పి వెళ్లి పోతాడు. దానికి సిద్దార్థ్ థాంక్యూ అని సమాధానమిచ్చి కారులో వెళ్లిపోతాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో వైరల్ అవుతుంది. అది చూసిన నెటిజన్లు సెల్ఫీ అడిగితే అంత కోపంగా చెప్పాలా? ఇంత యాటిట్యూడ్ పనికిరాదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

 

View this post on Instagram

 

A post shared by Instant Bollywood (@instantbollywood)

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here