Sidharth : సిద్ధార్థ్ మొదటి భార్య ఎవరో తెలుసా.. ఎందుకు విడిపోయారంటే!

- Advertisement -

Sidharth : బొమ్మరిల్లు హీరో సిద్దార్థ్ పేరుకు పరిచయాలు అవసరం లేదు. బాయ్స్ సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ఇతను ఒక్కో సినిమాతో తన టాలెంట్ ను నిరూపించుకుంటూ ఇప్పుడు స్టార్ హీరోగా అయ్యాడు. ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన కొంతకాలానికే స్టార్ ఇమేజ్ ను సొంతం చేసుకొని లవర్ బాయ్ గా పేరు తెచ్చుకున్నారు. బ్యాక్ టు బ్యాక్ హిట్ సినిమాలతో ప్రేక్షకుల మనసు దోచుకున్నాడు. నువ్వొస్తానంటే నేనొద్దంటానా, బొమ్మరిల్లు, ఆట,కొంచెం ఇష్టం కొంచెం కష్టం, ఓయ్ లతో ప్రేక్షకులను అలరించాడు.

 

- Advertisement -

ఈ సినిమాలు అన్ని హిట్ టాక్ ను అందుకున్నాయి. అందులో బొమ్మరిల్లు మాత్రం బ్లాక్ బాస్టర్ హిట్ టాక్ ను అందుకుంది. ఒక్క తెలుగులోనే కాదు తమిళ్ సినిమాల్లోకి కూడా ఎంట్రీ ఇచ్చి అక్కడ వరుస సినిమాలతో స్టార్ హీరో అయ్యాడు. ప్రస్తుతం తెలుగు సినిమాలకన్నా తమిళ సినిమాలతోనే బిజీగా ఉన్నాడు. అయితే సిద్దార్థ్ సినిమాల గురించి అందరికీ తెలిసే ఉంటుంది. కానీ పర్సనల్ లైఫ్ గురించి పెద్దగా తెలిసి ఉండదు. ఆయన పెళ్ళై విడాకులు కూడా తీసుకున్నాడు. అంతేకాదు మొదటి భార్యకు పిల్లలు కూడా ఉన్నారు.

ఆమె ఎవరో ఎలా పరిచయం అయ్యిందో ఇప్పుడు తెలుసుకుందాం. ఆమె పేరు మేఘన.. ఢిల్లీలో ఉన్నప్పుడు పక్క ఇంట్లో ఉండేది.. ఇద్దరికీ పరిచయం ఏర్పడింది. అది కాస్త ప్రేమగా మారడంతో పెళ్లి వరకు వెళ్లింది. ఆ తర్వాత కొన్ని కారణాలు, మనస్పర్థలు కారణంగా విడాకులు తీసుకున్నారు. అయితే వీరికి పిల్లలు కూడా ఉన్నారు. ఆ తర్వాత సిద్దార్థ్ శృతిహాసన్, సమంత తో ప్రేమాయణం నడిపించాడని వార్తలు వినిపించాయి. ఇప్పుడు అధితి రావు హైదరితో ప్రేమాయణం నడిపించాడు. చివరకు ఈరోజు సీక్రెట్ గా పెళ్లి చేసుకున్నారు. అందుకు సంబందించిన కొన్ని వార్తలు కూడా వైరల్ అవుతున్నాయి.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here