Shivaji: “90’s మిడిల్ క్లాస్ బయోపిక్” వెబ్ సిరీస్ తో మంచి విజయం అందుకున్న హీరో శివాజీకి ఇప్పుడు ఇండస్ట్రీలో అవకాశాలు వెల్లువెత్తుతున్నాయి. ప్రస్తుతం వరలక్ష్మి శరత్ నటిస్తున్న మూవీలో విలన్ గా శివాజీ నటిస్తున్నారు. అయితే తాజాగా అలీతో సరదాగా కార్యక్రమంలో పాల్గొన్న శివాజీ కొన్ని ఆసక్తికరమైన నిజాలను వెల్లడించారు. తన సినీ, రాజకీయ ప్రయాణంలో తానూ ఎదుర్కొన్న ఇబ్బందులను, కష్టాలను వివరించారు. ఇలా సాఫీగా జరుగుతున్న ప్రోగ్రామ్ లో యాంకర్ గా ఉన్న కమెడియన్ అలీ ఒక ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ ను శివాజీకి అడిగారు. ఆ విషయం ఎప్పటికి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ప్రశ్నకు ఈ షోలో శివాజీ ఆన్సర్ ఇచ్చారు.
అలీ అడిగిన ప్రశ్న ఏంటంటే… శివాజీ నీకు కూతురు ఉందా!! అని అడిగాడు. దీనికి శివాజీ సమాధానమిస్తూ…”ఆ కూతురు ఎక్కడుందో నాకు చూపిస్తే, నేనే పెంచుకుంటూ” అంటూ సరదాగా సమాధానం ఇచ్చారు. తనకు ఇద్దరు కొడుకులు మాత్రమే ఉన్నారని, వాళ్ళు ఇప్పుడు విదేశాల్లో మాస్టర్స్ చేస్తున్నారని తెలిపారు. అయితే ఈ కూతురు ఉందన్న రూమర్ రావడానికి నటుడు సమీర్ కారణమని, తనకు ఎవరో తప్పుగా చెప్పిన దాన్ని, తానూ ఇంటర్వ్యూ చెప్పడం వల్ల ఈ విషయం వైరల్ అవుతుందని శివాజీ వివరణ ఇచ్చారు. శివాజీ బిగ్ బాస్ కు వెళ్లినప్పటి నుండి ఈ విషయంపై చర్చ జరుగుతూనే ఉంది. ఇప్పుడు శివాజీ క్లారిటీ ఇవ్వడంతో ఈ విషయం మళ్ళీ చర్చకు రాకపోవచ్చు.
అయితే ఇదే షోలో శివాజీ తనకు కెరీర్ స్టార్టింగ్ లో చిరంజీవి ఎలా తన రూమ్ రెంట్స్ కట్టుకోవడానికి సహాయం చేశారో కూడా చెప్పారు. అలాగే విలువైన వస్తువులు కొనడం కంటే కూడా భూములు కొనడం చాలామంచిదని, ఈ సలహా తనకు అలీ ఇచ్చారని తెలిపారు. సెకండ్ ఇన్నింగ్ మొదలు పెట్టిన శివాజీ ఇప్పుడు వరుస మూవీస్ తో ఫుల్ బిజీగా ఉన్నారు. బిగ్ బాస్ షో తరువాత శివన్నగా శివాజీగా పాపులర్ అయ్యారు. ఆ షో విన్ కాకపోయినా కూడా చాలామంది పాపులారిటీ వచ్చింది. నెక్స్ట్ ఎలాంటి మూవీస్ తో శివాజీ అలరిస్తారో వేచి చూడాలి.