Sharwanand : విడాకుల కోసం వెంపర్లాడుతున్న హీరో శర్వానంద్..నాగచైతన్య సహకారం కూడా ఉందా!

- Advertisement -

Sharwanand : విభిన్నమైన కథలతో ప్రేక్షకులను ఎల్లప్పుడూ అలరించడానికి ప్రయత్నం చేసే హీరోలలో ఒకడు శర్వానంద్. క్యారక్టర్ ఆర్టిస్టుగా కెరీర్ ని ప్రారంభించిన శర్వానంద్, ఆ తర్వాత హీరో గా మారి రొటీన్ కి బిన్నంగా సినిమాలు చేస్తూ వచ్చాడు. కమర్షియల్ సక్సెస్ రావడానికి చాలా సమయమే పట్టింది కానీ, వచ్చిన తర్వాత తనని తానూ ప్రూవ్ చేసుకొని ఇండస్ట్రీ లో స్థిరపడ్డాడు. అయితే కొంతకాలం గా ఆయనకీ సరైన హిట్ లేదు.

Sharwanand
Sharwanand

గత ఏడాది విడుదలైన ‘ఒకే ఒక జీవితం’ అనే చిత్రం పర్వాలేదు అనే రేంజ్ లో ఆడింది. అంతకుముందు వరుసగా ఆయనకీ ఆరు ఫ్లాప్ సినిమాలు వచ్చాయి. ప్రస్తుతం ఆయన శ్రీ రామ్ ఆదిత్య దర్శకత్వం లో ఒక సినిమా చేస్తున్నాడు. కృతి శెట్టి ఇందులో హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా తర్వాత ఆయన ‘సామజవరగమనా’ మూవీ డైరెక్టర్ రామ్ అబ్బరాజు తో ఒక సినిమా చెయ్యబోతున్నాడు.

తొలుత ఈ చిత్రాన్ని అక్కినేని నాగ చైతన్య తో చేద్దాం అని అనుకున్నాడట డైరెక్టర్ రామ్ అబ్బరాజు. కానీ ఎందుకో ఆయనకీ ఈ కథ పెద్దగా నచ్చలేదు. విడాకుల నేపథ్యం లో ఈ సినిమా స్టోరీ ఉంటుందట. అందుకే నాగ చైతన్య కి కనెక్ట్ కాలేదని అంటున్నారు. కానీ ఇలాంటి డిఫరెంట్ సబ్జక్ట్స్ చెయ్యడానికి శర్వానంద్ ఎప్పుడూ ముందు ఉంటాడు. అబ్బరాజు ఆయనని కలిసి కథ వినిపించగానే అద్భుతంగా నచ్చాడట.

- Advertisement -

వెంటనే షెడ్యూల్స్ రెడీ చెయ్యమని చెప్పాడట. గతం లో నాగచైతన్య హీరో గా నటించిన ‘మజిలీ’ చిత్రం తరహాలో ఈ సినిమా కూడా ఉంటుందని సమాచారం. విడాకులు తీసుకున్న ఒక జంట కొన్ని రోజులు కలిసి ఒకే ఇంట్లో ఉండాల్సిన పరిస్థితి వస్తుందట. ఆ సందర్భం లో వాళ్ళ మధ్య ఏర్పడిన పరిస్థితుల ఆధారంగా ఈ కథని సిద్ధం చేసినట్టు తెలుస్తుంది. కామెడీ తో పాటుగా ఎమోషన్స్ కూడా చాలా బలంగా ఉంటాయని సమాచారం.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here