Sreeleela : ప్రస్తుతం టాలీవుడ్ నెంబర్ 1 హీరోయిన్ ఎవరు అని అడిగితే కళ్ళు మూసుకొని అందరూ చెప్పే పేరు శ్రీలీల. అందం , డ్యాన్స్ మరియు నటన ఇలా అన్నీ యాంగిల్స్ లో తనకి సాటి అని, నేటి తరం హీరోయిన్స్ ఎవ్వరూ సరితూగరు అని నిరూపించుకున్న ఈమెకి టాలీవుడ్ లో చిన్న హీరోల దగ్గర నుండి స్టార్ హీరోల వరకు ప్రతీ ఒక్కరు తమ సినిమాల్లో హీరోయిన్ గా తీసుకునేందుకు ఎగబడ్డారు.
రీసెంట్ గా ధమాకా వంటి బ్లాక్ బస్టర్ తర్వాత ఈమె నుండి మూడు సినిమాలు విడుదలైతే, అందులో స్కంద మరియు ఆది కేశవ చిత్రాలు ఘోరమైన డిజాస్టర్ ఫ్లాప్స్ గా నిలవగా, ‘భగవంత్ కేసరి’ చిత్రం మాత్రం పెద్ద హిట్ అవ్వడమే కాకుండా, నటిగా శ్రీలీల కి మంచి క్రేజ్ ని తెచ్చిపెట్టింది. ఇప్పుడు ఆమె హీరోయిన్ గా నటించిన ‘ఎక్స్ స్ట్రా ఆర్డినరీ మెన్’ 8 వ తారీఖున విడుదల కాబోతుంది.
ఈ సందర్భంగా ఈ చిత్రానికి సంబంధించిన ప్రొమోషన్స్ లో క్షణం తీరిక లేకుండా గడుపుతుంది మూవీ టీం. నితిన్ ఏర్పాటు చేసిన రీసెంట్ విలేఖరుల సమావేశం లో శ్రీలీల కారణంగా ఏర్పడిన ఇబ్బందులు మరియు టెన్సన్స్ గురించి చెప్పుకొచ్చాడు. ఆయన మాట్లాడుతూ ‘శ్రీలీల డేట్స్ తో మాకు పెద్ద టెన్షన్.
ఆమె ఒక్క రోజు డేట్ దొరికితే చాలా సంతోషపడేవాళ్ళం, ఆ డేట్ లో ఆమె వస్తుందా లేదా అని ఇంకో టెన్షన్, ఈరోజు ప్రొమోషన్స్ కి రావాలి, కానీ ఆమె రేపు వస్తాను అనింది, రేపైనా వస్తుందా లేదా అని మరో టెన్షన్, ఇలా ఆమె డేట్స్ కోసం ప్రతీ క్షణం టెన్షన్ పడుతూ నరకం అనుభవించాం’ అంటూ నితిన్ మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ అయ్యాయి. గతం లో హీరో రామ్ కూడా ఇలాగే శ్రీలీల పై ఫన్ చేసాడు.