Actor Nithin : గుర్తుపట్టలేని విధంగా మారిపోయిన హీరో నితిన్..కంగుతిన్న అభిమానులు!

Actor Nithin : యూత్ ఆడియన్స్ లో మంచి ఇమేజి ఉన్న హీరోలలో ఒకరు నితిన్. తొలి చిత్రం జయం తోనే ఇండస్ట్రీ రికార్డ్స్ ని బద్దలు కొట్టిన నితిన్, ఆ చిత్రం తర్వాత వరుస పలు హిట్స్ ,ఎక్కువగా ఫ్లాప్స్ ని ఎదురుకొని మార్కెట్ మొత్తాన్ని పోగొట్టుకున్నాడు. కానీ మళ్ళీ ఇష్క్ చిత్రం తో సూపర్ హిట్ కొట్టి భారీ కం బ్యాక్ ఇచ్చిన నితిన్, తనకంటూ ఒక బలమైన మార్కెట్ ని ఏర్పాటు చేసుకున్నాడు. అయితే ఇప్పుడు మళ్ళీ ఆయన వరుస ఫ్లాప్స్ లో ఉన్నాడు. భారీ అంచనాల నడుమ రీసెంట్ గా విడుదలైన మాచెర్ల నియోజకవర్గం, ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్ చిత్రాలు ఘోరమైన డిజాస్టర్స్ గా నిలిచాయి.

Actor Nithin
Actor Nithin

ఇప్పుడు ఆయన చేతుల్లో ‘వకీల్ సాబ్‘ దర్శకుడు వేణు శ్రీరామ్ ‘తమ్ముడు’, వెంకీ కుడుములు దర్శకత్వం వహిస్తున్న ‘రాబిన్ హుడ్’ అనే చిత్రాలు ఉన్నాయి. ఈ రెండు సినిమాల మీద నితిన్ అభిమానుల్లో, ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. వెంకీ కుడుముల గతం లో నితిన్ కి భీష్మ అనే భారీ బ్లాక్ బస్టర్ హిట్ చిత్రాన్ని చేసాడు. అలాగే వకీల్ సాబ్ దర్శకుడు వేణు శ్రీరామ్ కి కూడా మార్కెట్ లో మంచి క్రేజ్ ఉండడంతో ‘తమ్ముడు’ చిత్రానికి కూడా మంచి హైప్ ఉంది. ఇది ఇలా ఉండగా ‘రాబిన్ హుడ్’ కి సంబంధించిన నితిన్ లుక్ ఇప్పుడు సోషల్ మీడియా లో తెగ వైరల్ గా మారింది.

Nithiin on 'Extra-Ordinary Man': Comedy can get mechanical if we don't crack it at the earliest - The Hindu

ముసలి వాడి గెటప్ లో కార్లో కూర్చొని సెల్ఫీ దిగుతూ ఆయన అప్లోడ్ చేసిన వీడియో సెన్సేషన్ అయ్యింది. ఆయన పక్కనే కూర్చున్న శ్రీలీల లుక్ కూడా మిడిల్ ఏజ్ అమ్మాయి లాగ అనిపించింది. చూస్తుంటే నితిన్ ఈ చిత్రం ద్వారా సరికొత్త ప్రయోగంతో మన ముందుకు రాబోతున్నాడు అనేది అర్థం అయ్యింది. వరుస ఫ్లాప్స్ లో ఉన్న నితిన్ కి ఈ రెండు సినిమాలు భారీ హిట్ అవ్వడం అత్యవసరం. అందుకే ఎక్కడా కూడా తగ్గకుండా, ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఈ రెండు చిత్రాలు చేస్తున్నాడు. మరి నితిన్ ఈ రెండు సినిమాల ద్వారా తన పూర్వ వైభవం ని దక్కించుకుంటాడో లేదో చూడాలి.