Naga Shaurya : టాలీవుడ్ లో స్టార్ హీరో అయ్యేందుకు అన్నీ అర్హతలు ఉన్నప్పటికీ కూడా అదృష్టం కలిసిరాక ఇంకా మీడియం రేంజ్ మార్కెట్ తోనే కొనసాగుతున్న యంగ్ హీరోస్ లో ఒకడు నాగ శౌర్య. 'ఊహలు గుసగుసలాడే' అనే సినిమా ద్వారా ఇండస్ట్రీ కి పరిచయమైనా నాగ శౌర్య కి ఆ సినిమా తర్వాత 'ఛలో' అనే చిత్రం తప్ప మరో హిట్ లేదు. ఈ సినిమా ద్వారానే నాగ శౌర్య అమ్మగారు ఉషా ప్రసాద్ నిర్మాతగా మారింది.

ఆమె స్థాపించిన ఐరా ప్రొడక్షన్స్ లో ఈ చిత్రం భారీ లాభాల్ని తెచ్చి పెట్టింది. అంతే కాదు ఇప్పుడు నేషనల్ క్రష్ గా మరియు పాన్ ఇండియన్ స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్న రష్మిక మందన ని ఇండస్ట్రీ కి హీరోయిన్ గా పట్టుబట్టి మరీ పరిచయం చేసింది ఉషా గారేనట. తొలుత రష్మిక తల్లితండ్రులు ఆమెని టాలీవుడ్ పంపేందుకు అసలు ఒప్పుకోలేదట .

ఎందుకంటే కన్నడ లో ఇప్పుడిప్పుడే హీరోయిన్ గా రష్మిక కి మంచి అవకాశాలు వస్తున్నాయి..ఇలాంటి సమయం లో ఇండస్ట్రీ మారితే అవకాశాలు వస్తాయో రావో, ఒకవేళ టాలీవుడ్ లో సరైన అవకాశాలు రాకపోతే కెరీర్ మొత్తం పోతుంది అని భయపడ్డారట. అప్పుడు ఉషా ప్రసాద్ అలాంటిది ఏమి లేదు,ఈ సినిమా షూటింగ్ జరుగుతున్నన్ని రోజులు రష్మికకి తోడుగా ఆమె అమ్మ కూడా వచ్చేది అట. చిన్నగా అలవాటు అయిన తర్వాత ఆమె రావడం ఆపింది అట.

ఇక ఆ తర్వాత ఛలో సినిమా విడుదల అవ్వడం, అది పెద్ద బ్లాక్ బస్టర్ అవ్వడం, రష్మిక ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్ అవ్వడం ఇలా అన్నీ వరుసగా జరిగిపోయాయి. రష్మికని ఈ సినిమా షూటింగ్ జరిగినన్ని రోజు నాగ శౌర్య తల్లి ఉషా గారు ఆమెని ఒక కూతురిలా చూసుకుంది అట. ఆమె కూతురు అయితే నాగ శౌర్య రష్మిక కి అన్నయ్య అవుతాడు. ఇది విన్న తర్వాత నెటిజెన్స్ సోషల్ మీడియా లో చెల్లితో రొమాన్స్ చేసిన అన్నయ్య అంటూ సరదాగా కామెంట్స్ చేస్తున్నారు.
