Gopichand: ‘తొలి వలపు’ అనే సినిమాతో హీరో గా వెండితెర అరంగేట్రం చేసిన ప్రముఖ దర్శకుడు టీ. కృష్ణ కుమారుడు గోపీచంద్ ఆ సినిమా అట్టర్ ఫ్లాప్ అవ్వడం తో కొంతకాలం సినిమాలకు బ్రేక్ ఇచ్చి మళ్ళీ తేజా దర్శకత్వం లో తెరకెక్కుతున్న ‘జయం’ సినిమాతో విలన్ గా రీ ఎంట్రీ ఇచ్చాడు. ఈ సినిమాలో గోపీచంద్ పోషించిన విలన్ పాత్రకి సెన్సేషనల్ రెస్పాన్స్ వచ్చింది.

ఆ తర్వాత వరుసగా ఆయన నిజం, వర్షం మరియు తమిళ జయం సినిమాల్లో విలన్ గా నటించి సౌత్ లోనే మోస్ట్ డిమాండ్ ఉన్న విలన్ గా మారాడు. కానీ ఆ సమయం లోనే ఆయన హీరోగా ‘యజ్ఞం’ అనే చిత్రం చేసాడు. ఈ సినిమా అప్పట్లో పెద్ద హిట్ అయ్యింది. ఆ తర్వాత ఆయన మళ్ళీ వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. హీరో గా హిట్టు మీద హిట్టు కొడుతూ దూసుకెళ్లిన గోపీచంద్ పెద్ద మాస్ హీరో గా ఎదిగాడు.

ఇంకో రెండు సరైన బ్లాక్ బస్టర్ హిట్స్ తగిలితే గోపీచంద్ ఇక టాలీవుడ్ స్టార్స్ లో ఒకడిగా మారిపోతాడని అందరూ అనుకున్నారు. కానీ ఆ సమయం లోనే ఆయనకీ వరుసగా ఫ్లాప్ సినిమాలు, డిజాస్టర్ సినిమాలు రావడం మొదలయ్యాయి. రీసెంట్ గా అయితే ఆయన మార్కెట్ మరీ ఘోరంగా తయారైంది. ఒకప్పుడు టాక్ తో సంబంధం లేకుండా ఓపెనింగ్స్ వచ్చేవి, ఇప్పుడు అది కూడా మైనస్ అయ్యింది. అందుకు ఉదాహరణ ఆయన చివరి చిత్రం ‘రామబాణం’ చిత్రమే.

దీంతో గోపీచంద్ బాగా అవుట్ డేటెడ్ హీరో అయిపోయాడు, అందుకే ఆయనకీ రెమ్యూనరేషన్ అడిగినంత ఇవ్వడానికి సంకోచిస్తున్నారు. ఒకప్పుడు రెండు నుండి మూడు కోట్ల రూపాయిల రెమ్యూనరేషన్ ని తీసుకునే గోపీచంద్ , ఇప్పుడు నెల జీతం లెక్క పని చెయ్యడానికి ఒప్పుకున్నాడట. అలా ఒక సినిమా మీద ఎన్ని నెలలు పని చేస్తే అంత రెమ్యూనరేషన్ అన్నమాట. నెలకి ఎంత అనేది మాత్రం బయటకి రాలేదు. ఈ వార్త విని ఆయన అభిమానులు ఎలాంటి రేంజ్ లో ఉండాల్సిన హీరో, ఇలా అయ్యిపోయాడేంటి అని బాధపడుతున్నారు.