Actor Nepolean టాలీవుడ్ సరికొత్త ట్రెండ్ ని సృష్టించిన సినిమాలలో ఒకటి అక్కినేని నాగార్జున హీరో గా నటించిన ‘హలో బ్రదర్’ అనే చిత్రం, ఈవీవీ సత్యనారాయణ దర్శకత్వం లో తెరకెక్కిన ఈ సినిమా ఆరోజుల్లో బాక్స్ ఆఫీస్ రికార్డ్స్ ని షేక్ చేసింది.ఇక ఈ చిత్రం లో విలన్ గా నటించిన ‘నెపోలియన్’ ని అంత తేలికగా ఎవ్వరు మర్చిపోలేరు.ఇప్పటికీ కొన్ని సినిమాలలో ఈయన రిఫరెన్స్ ని వాడుకుంటూ ఉంటారు దర్శకులు, ఆ రేంజ్ లో ఆ పాత్ర పండింది..

సుమారు వంద సినిమాల్లో హీరో గా విలన్ గా మరియు క్యారక్టర్ ఆర్టిస్టు గా చేసిన నెపోలియన్ టాలీవుడ్ లో మాత్రం కేవలం నాలుగు సినిమాల్లో నటించాడు, అందులో ఒకటి హలో బ్రదర్ కాగా, మిగిలిన సినిమాలు ఓయ్, సలీం మరియు శరభ అనే చిత్రాలలో నటించాడు.ఈయన ఫిల్మోగ్రఫీ లో 90 శాతం మొత్తం తమిళ సినిమాలే ఉంటాయి.

అయితే గత ఏడాది ఈయన హాలీవుడ్ లోకి కూడా అడుగుపెట్టాడు.అక్కడ ఈయన ‘వన్ మోర్ డ్రీం’ మరియు ‘ట్రాప్ సిటీ’ వంటి సినిమాలలో నటించాడు.అలా ఈయన సౌత్ నుండి హాలీవుడ్ కి వెళ్లిన అతి తక్కువ మంది నటులలో ఒకడిగా నిలిచాడు.మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే ఈయన రాజకీయాల్లో కూడా ఎంతో ఉన్నత పదవులను అధిరోహించాడు.తమిళనాడు లో ఈయన DMK పార్టీ చేరి ఒకసారి ఓడిపోయాడు.

నెపోలియన్ ఆ తర్వాత 2009 వ సంవత్సరం కాంగ్రెస్ పార్టీ లో చేరి లోక్ సభ కి ఎన్నికయ్యాడు,అంతే కాదు కాంగ్రెస్ కేంద్ర మంత్రి క్యాబినెట్ లో ఇతనికి స్థానం కూడా దక్కింది..’మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఫర్ సోషల్ జస్టిస్ అండ్ ఎమ్ పవర్మెంట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గా 2009 వ సంవత్సరం నుండి 2014 వరకు పని చేసాడు,ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ కూలిపోవడం తో 2014 వ సంవత్సరం లోనే బీజేపీ పార్టీ లో చేరాడు, అక్కడ ఇప్పుడు ప్రస్తుతం స్టేట్ వైస్ ప్రెసిడెంట్ గా వ్యవహరిస్తున్నాడు.