Hebba Patel : టాలీవుడ్ ఇండస్ట్రీలో హాట్ బ్యూటీగా పేరు తెచ్చుకున్న హెబ్బా పటేల్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. హెబ్బా పటేల్ పుట్టి పెరిగింది ముంబైలోనే. మొదటగా ఓ డ్యాన్సర్ గా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోయిన్ గా మంచి గుర్తింపు సంపాదించుకుంది. హెబ్బా పటేల్ మొదటగా కన్నడ ఇండస్ట్రీతోనే కెరీర్ ప్రారంభించింది. 2014లో కన్నడ సినీ పరిశ్రమకు అధ్యక్ష అనే సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. ఆ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ బ్యూటీ వరుసగా మూడు సినిమాలు చేసి పాపులర్ అయింది. ఆ తర్వాత టాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది.

2015లో కుమారి 21ఎఫ్ అనే సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయింది. ఈ సినిమాలో రాజ్ తరుణ్ సరసన హీరోయిన్ గా నటించింది. ఆ సినిమాలో కుమారి పాత్రలో హాట్ అండ్ బోల్డ్ సీన్లలో మెరిసింది. ఈ సినిమా యూత్ ను బాగా ఆకట్టుకుంది. ఈ సినిమాతో మంచి సక్సెస్ అందుకున్న హెబ్బా పటేల్ కు వరుసగా సినిమా ఆఫర్లు వచ్చాయి. ఈడోరకం ఆడోరకం, ఎక్కడికి పోతావు చిన్నవాడా, అందగాడు, మిస్టర్, ఒరేయ్ బుజ్జిగా లాంటి ఎన్నో మంచి సినిమాల్లో నటించింది. గ్లామర్ విషయంలో ఏమాత్రం తగ్గకుండా తన అందాలతో అందరినీ ఆకట్టుకుంటుంది. సోషల్ మీడియాలోనూ నిత్యం యాక్టివ్ గా ఉంటూ తన గ్లామరస్ ఫోటోలతో యువతకు చెమటలు పట్టిస్తోంది. ఈ క్రమంలో సోషల్ మీడియాలో ఆమె పోస్ట్ చేసిన ఫోటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.
తాజాగా ఈ అమ్మడు ఇన్‌స్టా వేదికగా కొన్ని ఫోటోలను షేర్ చేసింది. చీర కట్టులో తన అందాలతో సెగలు పుట్టిస్తూ ఫోటోలకి పోజులిచ్చింది. అంతే కాక ‘హనీమూన్ ఎక్స్‌ప్రెస్’ అంటూ క్యాప్షన్ జోడించింది. అది చూసిన నెటిజన్లు తన కొత్త సినిమాకు ఆల్ ది బెస్ట్ చెబుతున్నారు.. హాట్ బ్యూటీ ట్రెడిషనల్ బ్యూటీ అయ్యిందంటూ కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట్లో తెగ వైరల్ అవుతున్నాయి.
View this post on Instagram