చిన్న పిల్లవాడి నుండి పెద్దవాళ్ళ వరకు ప్రతీ ఒక్కరు వయస్సుతో సంబంధం లేకుండా చిందులేసేది ఐటెం సాంగ్స్ కి మాత్రమే అని చెప్పడం లో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఎన్ని తారలు మారినా ఈ ఐటెం సాంగ్స్ కి ఉన్న క్రేజ్ మాత్రం తరగిపోదు. అలా మన మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లో ఎన్నో బ్లాక్ బస్టర్ ఐటెం సాంగ్స్ ఉన్నాయి. వాటిల్లో ఒకటి ‘శంకర్ దాదా MBBS’ చిత్రం లోని ‘నాపేరే కాంచన మాలా’ అనే సాంగ్.

సెకండ్ హాఫ్ లో వచ్చే సాంగ్ కి అప్పట్లో థియేటర్స్ మొత్తం షేక్ అయ్యాయి. ఈ సాంగ్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా కొన్ని సెకండ్స్ పాటు తళుక్కుమని మెరుస్తాడు. ఇక ఈ పాటలో మెగాస్టార్ చిరంజీవి తో కలిసి స్టెప్పులేసి ఆ హాట్ బ్యూటీ ఎవరు అని అప్పట్లో చాలా మందిలో కలిగిన సందేహం.

అయితే ఇప్పటి లాగా అప్పట్లో ఇంటర్నెట్ లాంటివి ఏమి లేవు కదా, కాబట్టి అప్పట్లో ఈమె ఎవరో చాలా మందికి తెలియదు.కానీ ఇప్పుడు సోషల్ మీడియా లో ఎవరి గురించి తెలుసుకోవాలన్నా క్షణాల్లో తెలుస్కోవచ్చు, అలా ఈమె ఎవరు అని వెతకగా, ఆమె పేరు గాహార్ ఖాన్ అని తెలిసింది.మోడలింగ్ రంగం లో అడుగుపెట్టిన గాహార్ ఖాన్ 2002 ఫెమినా మిస్ ఇండియా పోటీలలో పాల్గొని ఓడిపోయింది. కానీ ఈమె బాలీవుడ్ బడా దర్శకుల దృష్టిలో పడడంతో ఈమెకి వరుసగా ఆఫర్ల వెల్లువ కురిసింది.

మొదటి సినిమా 2004 వ సంవత్సరం లో విడుదలైన ‘మెన్ ఎట్ వర్క్’ కాగా, రెండవ సినిమా మాత్రం మన తెలుగులో మెగాస్టార్ చిరంజీవి హీరో గా నటించిన ‘శంకర్ దాదా MBBS’ చిత్రమే. ఇక ఆ తర్వాత 5 ఏళ్ళ పాటు సినిమాలకు గ్యాప్ ఇచ్చిన ఈమె, మళ్ళీ 2009 వ సంవత్సరం లో రీ ఎంట్రీ ఇచ్చి 2021 వ సంవత్సరం వరకు యాక్టీవ్ గా సినిమాలు చేసింది. 2013 వ సంవత్సరం లో తన తోటి బిగ్ బాస్ కంటెస్టెంట్ కుషాల్ టాండన్ ని పెళ్లాడింది.
ఆ తర్వాత కొన్నాళ్ళకు అతనితో విడిపోయిన ఈమె, ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ తనయుడు ఇస్మాయిల్ దర్భార్ కొడుకు జైద్ దర్బార్ ని పెళ్లాడింది. ఇది ఇలా ఉండగా ఈమెకి సంబంధించిన లేటెస్ట్ ఫోటోలు కొన్ని మీకోసం ఎక్సక్లూసివ్ గా అందిస్తున్నాము చూడండి.





