Arya 2 లో నటించిన ఈ చైల్డ్ ఆర్టిస్ట్ ఇప్పుడే ఎలా తయారయ్యాడో చూసారా..! పవన్ కళ్యాణ్ సినిమాలో కూడా నటించేసాడు!

- Advertisement -

Arya 2 స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ మరియు సుకుమార్ కాంబినేషన్ లో వచ్చిన రెండవ సినిమా ‘ఆర్య 2’.అప్పట్లో వీళ్లిద్దరి కాంబినేషన్ లో వచ్చిన ఆర్య సినిమా ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ అయ్యిందో మన అందరికీ తెలిసిందే. ఈ సినిమా తర్వాత మళ్ళీ వీళ్లిద్దరి కాంబినేషన్ లో ఈ సీక్వెల్ తెరకెక్కింది. ఈ చిత్రం కమర్షియల్ గా యావరేజి గా నిల్చింది కానీ, అప్పట్లో ఈ చిత్రం లోని పాటలు ఒక సెన్సేషన్.

Arya 2
Arya 2

ఈ సినిమాలో అల్లు అర్జున్ వేసిన డ్యాన్స్ వల్లే ఆయనకీ పాన్ ఇండియా రేంజ్ లో రీచ్ వచ్చింది. ఇక్కడి నుండే ప్రతీ ఒక్కరు అల్లు అర్జున్ సినిమాలను చూడడం ప్రారంభించారు ఇతర భాషల్లో. ఈ సినిమా తర్వాత అల్లు అర్జున్ నటుడిగా కూడా ఎంతో పరిణీతి చెందినట్టుగా అందరికీ అనిపించింది. అయితే ఈ సినిమా నటించిన చైల్డ్ ఆర్టిస్ట్స్ గురించి ఇప్పుడు ఒక ఆసక్తికరమైన విషయం బయటపడింది.

ఇక అసలు విషయానికి ఈ సినిమాలో అల్లు అర్జున్ స్నేహితుడిగా నటించిన నవదీప్ చిన్నప్పటి క్యారక్టర్ అందరికీ గుర్తు ఉండే ఉంటుంది. ఈ పాత్ర పోషించిన కుర్రాడి పేరు అనుదీప్. ఇతను ఇప్పుడు పెద్దవాడే, ఏకంగా పవన్ కళ్యాణ్ నటించిన ‘బ్రో ది అవతార్’ చిత్రం లో చేసే రేంజ్ కి వచేసాడు. ఈ చిత్రం లో తనికెళ్ళ భరణి కొడుకు గా నటించిన వ్యక్తి మీ అందరికీ గుర్తు ఉండే ఉంటారు.

- Advertisement -

ప్రీ క్లైమాక్స్ లో ఇతగాడి నిజస్వరూపం తెలిసి సాయి ధరమ్ తేజ్ చితక్కొడుతాడు. అతను మరెవరో కాదు, ఆర్య 2 లో చిన్న నవదీప్ గా నటించిన ఈ కుర్రాడే. పెద్దయ్యాక ఇతగాడు చేసిన మొదటి సినిమా ‘బ్రో ది అవతార్’. భవిష్యత్తులో మరింత గొప్ప రేంజ్ కి వెళ్లే ఛాన్స్ కూడా ఉంది. చూడాలి మరి ఈ కుర్రాడు ఏ రేంజ్ లో వెళ్తాడు అనేది .

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here