టాలీవుడ్ నుండి పాన్ ఇండియన్ స్టార్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న ఇద్దరు ముగ్గురు డైరెక్టర్స్ లో ఒకరు సుకుమార్. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరో గా నటించిన ఆర్య సినిమాతో డైరెక్టర్ గా ఇండస్ట్రీ కి పరిచయమైనా సుకుమార్, తొలి సినిమాతోనే సూపర్ హిట్ కొట్టి స్టార్ స్టేటస్ ని దక్కించుకున్నాడు.
ఈ సినిమా తర్వాత ఆయన చేసిన చిత్రాలలో రంగస్థలం వరకు ఆర్య రేంజ్ హిట్ లేకపోయినా కూడా సుకుమార్ తన అద్భుతమైన టేకింగ్ తో తనకంటూ ఒక బ్రాండ్ ఇమేజి ని ఏర్పాటు చేసుకున్నాడు. ఆ తర్వాత ఆయన ‘రంగస్థలం’ చిత్రం తో ఇండస్ట్రీ ని షేక్ చేసే బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి, నెంబర్ 1 డైరెక్టర్స్ లిస్ట్ లోకి దూసుకొచ్చాడు. ఈ చిత్రం తర్వాత ఆయన వెంటనే అల్లు అర్జున్ తో ‘పుష్ప : ది రైజ్’ మూవీ చేసి పాన్ ఇండియా మొత్తాన్ని షేక్ చేసాడు.
ఇప్పుడు పాన్ ఇండియా లెవెల్ లో టాప్ 5 డైరెక్టర్స్ లిస్ట్ ఒకసారి తీస్తే అందులో సుకుమార్ ముందు వరుసలో ఉంటాడు. ఇప్పుడు ఆయన తెరకెక్కిస్తున్న ‘పుష్ప : ది రూల్’ సినిమా కోసం భారతదేశం మొత్తం ఎదురు చూస్తుంది. ఇదంతా పక్కన పెడితే సుకుమార్ వ్యక్తిగత విషయాల గురించి ఆయన ఫ్యాన్స్ కి చాలా తక్కువ విషయాలు మాత్రమే తెలుసు. ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టకముందు ఆయన ఒక లెక్కల టీచర్ గా పని చేసేవాడు. ఇక ఇండస్ట్రీ లోకి వచ్చిన తర్వాత 14 ఏళ్ళ క్రితం తబిత బందిరెడ్డి అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు.
వీళ్లిద్దరు పెళ్లి చేసుకొని 14 ఏళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆమె సోషల్ మీడియా లో సుకుమార్ స్టైల్ లో అభిమానులతో ఈ విషయాన్నీ పంచుకుంది. మా వైవాహిక జీవితం ఈక్వల్ టూ 730 వారాల ఆనందం, 5110 రోజుల విధేయత, 122721 గంటల అవగాహనా, 7363288 నిమిషాల పట్టుదల, 441797328 సెకండ్ల నిబద్దత అంటూ సుకుమార్ స్టైల్ లో లాజిక్ గా పోస్ట్ చేసింది. ఇది ఇప్పుడు సోషల్ మీడియా లో ఇప్పుడు వైరల్ గా మారింది. ఇక ఆమెని చూసిన ప్రతీ ఒక్కరు ఇంత అందంగా ఉన్నారు ఏంటి, నేటి తరం స్టార్ హీరోయిన్స్ కూడా మీ ముందు సరితూగరు అంటూ నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.