Anchor Jhansi కూతురిని చూశారా.. ఏ హీరోయిన్ కూడా తన కాలి గోటికి సరిపోరు

- Advertisement -


Anchor Jhansi : టాలీవుడ్ లో యాంకర్ గా, నటిగా ఎంతో పాపులారిటీ సంపాదించుకున్నారు ఝాన్సీ. ఆమె అంటే ఇష్టపడని బుల్లి తెర ప్రేక్షకులు ఉండరు. కెరియర్ మొదట్లోనే పలు సినిమాలలో నటించి మంచి నటిగా గుర్తింపు సంపాదించుకుని.. బుల్లితెరపై కూడా తన హవా కొనసాగించింది. అప్పట్లో బుల్లితెరపై ఒక వెలుగు వెలిగిన ఝాన్సీ.. ఈ మధ్యకాలంలో పెద్దగా ఎక్కడా యాంకర్ గా రాణించడం లేదు.

Anchor Jhansi
Anchor Jhansi

కానీ అడపా దడపా సినిమాలలో మంచి మంచి పాత్రలతో ముందుకు వచ్చి సక్సెస్ అవుతోంది. ఇక ఝాన్సీ వ్యక్తిగత విషయానికి వస్తే తాను నటుడు జోగి నాయుడుని ప్రేమించి పెళ్లి చేసుకుంది. వీరికి ఓ కుమార్తె పుట్టిన తర్వాత వారి మధ్య వచ్చిన మనస్పర్థల కారణంగా విడిపోయారు. వీరికి పుట్టిన కూతురు పేరు ధన్య. ప్రస్తుతం తాను తన తల్లి ఝాన్సీ వద్దనే పెరుగుతోంది. ఇంతవరకు ఝాన్సీ ఎప్పుడు తన కుమార్తెను ఎక్కడ చూపించలేదు. కానీ తాజాగా తన కుమార్తె ఫోటోలను సోషల్ మీడియా వేదికగా పరిచయం చేసింది.

Anchor Jhansi Daughter DHanya

ఝాన్సీ కుమార్తె ధన్య ఫోటోని చూసిన పలువురు అభిమానులు ఆశ్చర్యపోతున్నారు. పలు రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. అచ్చం తల్లి ఝాన్సీ పోలికలతో చాలా అందంగా కనిపిస్తోంది. అంత అందాన్ని చూసి ప్రతి ఒక్కరు ఆశ్చర్యపోతున్నారు. ఝాన్సీ కుమార్తె తనకంటే అందంగా ఉంది. తను కనుక ఇండస్ట్రీలోకి వస్తే ఖచ్చితంగా సక్సెస్ అవుతుందని ఈ ఫోటోలు చూసిన వాళ్లు కామెంట్స్ చేస్తున్నారు. ఝాన్సీ తన కుమార్తె ధన్య పుట్టినరోజు కావడంతో తన కుమార్తెతో ఉన్న ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేసింది. తన కూతురు గురించి వివరిస్తూ గోల్డ్ అండ్ బోల్డ్ అంటూ.. కూతుర్లు పుట్టడం అదృష్టం అంటూ క్యాప్షన్ పెట్టింది. ఇప్పుడు ఆమె ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here