తెలుగు చలన చిత్ర పరిశ్రమకి మూలస్తంభం లాంటి ముఖ్యులలో ఒకరు అక్కినేని నాగేశ్వర రావు గారు. టాలీవుడ్ నటన నేర్పిన ఇద్దరు ముగ్గురు ప్రముఖులలో ఒకరు ఆయన. ఆయన లేజసీ అని అక్కినేని నాగార్జున పాన్ ఇండియా లెవెల్ కి తీసుకెళ్లాడు. తన జనరేషన్ లో టాప్ 3 హీరోలుగా పిలవబడే వారిలో ఒకరిగా నిలిచాడు. కానీ ఆయన కొడుకులు మాత్రం అక్కినేని నాగార్జున లేజసీ ని కొనసాగించలేకపోయారు.

అక్కినేని నాగ చైతన్య పర్వాలేదు అనే రేంజ్ లో సక్సెస్ అయితే, నాగార్జున రెండవ కొడుకు అక్కినేని అఖిల్ మాత్రం ఇప్పటి వరకు ఒక్క సూపర్ హిట్ ని కూడా అందుకోలేకపోయాడు. ఒక్కమాట లో చెప్పాలంటే అక్కినేని మూడవ తరం హీరోలు నాగార్జున సాధించిన స్టార్ స్టేటస్ లో పావు శాతం కూడా సాధించలేకపోయారు. ఇకపోతే నాగేశ్వర రావు కి అక్కినేని నాగార్జున తో పాటుగా అక్కినేని వెంకట్ అనే కుమారుడు కూడా ఉన్నాడు.

ఈయన సినిమాలకు పూర్తిగా దూరం, వ్యాపార రంగం లో గొప్పగా రాణించాడు. వెంకట్ తో పాటుగా నాగ సుశీల,సత్యవతి,సరోజ అని ముగ్గురు కూతుర్లు ఉన్నారు. నాగ సుశీల కొడుకు సుశాంత్ ఇప్పుడు టాలీవుడ్ లో హీరో గా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. అయితే అక్కినేని వెంకట్ కి కూడా ఒక కొడుకు ఉన్నాడు. అతని పేరు అక్కినేని ఆదిత్య. హీరో అయ్యేందుకు అన్నీ అర్హతలు ఉన్నప్పటికీ కూడా ఆయన సినిమాల వైపు కన్నెత్తి కూడా చూడలేదు.

ఫారిన్ లో మంచిగా చదువుకొని,అక్కడే సాఫ్ట్ వేర్ రంగం లో గొప్పగా రాణిస్తున్నాడు. మూడేళ్ళ క్రితమే ఈయనకి పెళ్లి కూడా జరిగింది. ఈ పెళ్లి వేడుక లో అక్కినేని ఆదిత్య ని చూసి అందరూ షాక్ కి గురి అయ్యారు. ఇంత అందంగా ఉన్నదేంటి, హీరో అయ్యుంటే ఈపాటికి అఖిల్ కంటే గొప్ప స్థానం లో ఉండేవాడేమో అంటూ సోషల్ మీడియా లో కామెంట్స్ చేస్తున్నారు. అతనికి సంబంధించిన ఫోటోలు ఈ క్రింది వీడియో లో మీరే చూడండి.