Hanuman Trailer Review : గొప్ప సినిమాలు తియ్యడానికి వందల కోట్ల రూపాయిల బడ్జెట్ అవసరం లేదు, అతి తక్కువ బడ్జెట్ తోనే అద్భుతాలు సృష్టించొచ్చు అని ఇండియన్ సినిమా ఇండస్ట్రీ హిస్టరీ లో ఎంతో మంది దర్శకులు నిరూపించారు. అలాంటి దర్శకులు మన టాలీవుడ్ కరువు అయ్యారే అని అనుకుంటున్న సమయం లో డైరెక్టర్ ప్రశాంత్ వర్మ తన టాలెంట్ ఎలాంటిదో ఇండస్ట్రీ కి చూపించాడు.

తన ప్రతీ కొత్త సినిమాతో వైవిద్యం చూపిస్తూ వచ్చిన ప్రశాంత్ వర్మ, గత ఏడాది తేజ సజ్జల తో ‘హనుమాన్’ అనే పాన్ ఇండియన్ ప్రాజెక్ట్ మొదలు పెట్టాడు. ఈ సినిమాకి సంబంధించిన టీజర్ ని గత ఏడాది విడుదల చెయ్యగా దానికి ఆడియన్స్ నుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. 500 బడ్జెట్ తో తీసిన ‘ఆదిపురుష్’ చిత్రం టీజర్, 20 కోట్ల బడ్జెట్ తో తీసిన ‘హనుమాన్’ టీజర్ రేంజ్ లో పావు శాతం కూడా లేదని అప్పట్లో కామెంట్స్ కూడా వినిపించాయి.

ఈ చిత్రం ఎప్పుడెప్పుడు విడుదల అవుతుందా అని ఆడియన్స్ ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్న సమయం నిర్మాతలు జనవరి 12 వ తేదీన విడుదల చేస్తున్నట్టు చెప్పుకొచ్చారు. మహేష్ బాబు సినిమా మరియు మిగతా క్రేజీ సినిమాలన్నీ అప్పుడు విడుదల అవుతాయి, అలాంటి సమయం లో ఈ చిన్న చిత్రం ని విడుదల చేసి రిస్క్ చేస్తున్నారు, ఈ చిత్రం నలిగిపోతుందేమో అని అనుకున్నారు అందరూ. కానీ కాసేపటి క్రితం విడుదలైన ట్రైలర్ ని చూస్తే సంక్రాంతికి వస్తున్న సినిమాలన్నీ భయపడేలా ఉన్నాయి.
ఆ ట్రైలర్ లో విజువల్స్ ఆడియన్స్ మైండ్ ని బ్లాస్ట్ అయ్యేలా చేసింది. అసలు ఇంత తక్కువ బడ్జెట్ తో ఈ రేంజ్ క్వాలిటీ ఎలా సాధ్యం అని ఆడియన్స్ నోరెళ్లబెట్టారు. ఒక అమాయకపు కుర్రాడికి అతీతమైన శక్తులు కొన్ని సంఘటనల కారణంగా వస్తే, దాని పరిణామాలు ఎలా ఉంటాయి అనేది ఈ సినిమా స్టోరీ లైన్ గా ట్రైలర్ ని చూసినప్పుడు తెలుస్తుంది. సినిమా కూడా ట్రైలర్ లాగానే ఆడియన్స్ ని ఆశ్చర్యపరుస్తుందో, లేదా నిరాశపరుస్తుందో అనేది తెలియాలంటే జనవరి 12 వరకు ఆగాల్సిందే.