Hanuman Movie Review : టీజర్ దగ్గర నుండే ఆడియన్స్ ని విశేషంగా ఆకట్టుకున్న చిత్రాలలో ఒకటి ‘హనుమాన్’. అతి తక్కువ బడ్జెట్ తో చిన్న ఆర్టిస్టులతో డైరెక్టర్ ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన ఈ సినిమా కి ఒక స్టార్ హీరోకి ఉన్నంత క్రేజ్ ఏర్పడింది. బాలనటుడిగా మన అందరినీ మెప్పించిన తేజ సజ్జల, ఒక హీరోగా మారి ఈ సూపర్ స్టార్ మహేష్ బాబు తో పోటీ పడే రేంజ్ కి ఎదుగుతాడని ఎవ్వరూ ఊహించలేకపోయారు.

జనవరి 12 వ తారీఖున మహేష్ బాబు ‘గుంటూరు కారం’ చిత్రంతో పాటుగా ఈ సినిమా విడుదల అవుతుంది. హైదరాబాద్ వంటి సిటీస్ లో హనుమాన్ చిత్రాన్ని దారుణంగా, ఉద్దేశపూర్వకంగా దిల్ రాజు తొక్కేస్తున్నాడు. ఈ చిత్ర నిర్మాత నిరంజన్ రెడ్డి కూడా ఈ అంశంపై మీడియా సమావేశం ఏర్పాటు చేసి తమ సినిమాకి అన్యాయం చేస్తున్నారని దిల్ రాజు మీద ఆరోపణలు చేసాడు.

ఎంత బెదిరింపులు చేసినా కూడా ఒక్క అడుగు వెనక్కి వేసే సమస్యే లేదని, జనవరి 12 వ తారీఖునే మా చిత్రాన్ని విడుదల చేస్తున్నామని చెప్పుకొచ్చాడు. ఇకపోతే రీసెంట్ గానే ఈ సినిమాకి సంబంధించిన ప్రివ్యూ షో ని ప్రసాద్ ల్యాబ్స్ లో మెగా స్టార్ చిరంజీవి తో పాటు పలువురు ముఖ్యమైన సినీ ప్రముఖలకు వేసి చూపించారు. ఈ ప్రివ్యూ షో నుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. టీజర్ మరియు ట్రైలర్ లో చూసినట్టుగానే అద్భుతంగా ఈ సినిమా వచ్చిందని.

ఇప్పుడు చిన్న సినిమాగానే విడుదల అవ్వొచ్చు కానీ, విడుదల తర్వాత ఈ చిత్రం పెద్ద సినిమాలను సైతం డామినేట్ చేస్తుందని ఈ చిత్రాన్ని చూసినవాళ్లు డైరెక్టర్ ప్రశాంత్ వర్మ ని పొగడ్తలతో ముంచి ఎత్తారు. ముఖ్యంగా పతాక సన్నివేశాల్లో వచ్చే ఆంజనేయ స్వామి సన్నివేశాలు మూవీ కి హైలైట్ గా నిలిచాయని, కచ్చితంగా ఆడియన్స్ కి ఒక సరికొత్త అనుభూతి కలుగుతుందని కితాబు ఇచ్చారు. మరి ఆ రేంజ్ లో సినిమా ఉందో లేదో మరో వారం రోజుల్లో తెలియనుంది.
