Hanuman : వామ్మో..’హనుమాన్’ హిట్ అవ్వాలంటే ఎన్ని కోట్లు వసూలు చెయ్యాలో తెలుసా..ఇది అసలు సాధ్యమేనా!

- Advertisement -

Hanuman : చిన్నగా సినిమాగా మొదలై ప్రమోషనల్ కంటెంట్ తో ప్రేక్షకుల దృష్టిని విశేషంగా ఆకట్టుకున్న చిత్రం ‘హనుమాన్’. ప్రశాంత్ వర్మ దర్శకత్వం లో తేజ సజ్జల హీరో గా నటించిన ఈ సినిమా కోసం ఆడియన్స్ తో పాటుగా ట్రేడ్ కూడా ఎంతో ఆత్రుతతో ఎదురు చూస్తూ ఉంది. ఇంత తక్కువ బడ్జెట్ తో ఈ రేంజ్ క్వాలిటీ ని మైంటైన్ చెయ్యొచ్చా అని పెద్ద పెద్ద మేకర్స్ కూడా నోరెళ్లబెట్టేలా చేసాడు ఆ చిత్ర డైరెక్టర్ ప్రశాంత్ వర్మ.

మరో విశేషం ఏమిటంటే ఈ చిత్రానికి ‘బుక్ మై షో’ యాప్ లో సూపర్ స్టార్ మహేష్ బాబు ‘గుంటూరు కారం’ చిత్రం కంటే ఎక్కువ ఇంట్రెస్ట్స్ వచ్చాయి. దీనిని బట్టి అర్థం చేసుకోవచ్చు, ఈ సినిమా కోసం ఆడియన్స్ ఏ రేంజ్ లో ఎదురు చూస్తున్నారు అనేది. ఈ చిత్రం జనవరి 12 వ తారీఖున ప్రపంచవ్యాప్తంగా అన్నీ ప్రాంతీయ భాషల్లో పాన్ ఇండియా లెవెల్ లో విడుదల కాబోతుంది.

ఇదంతా పక్కన పెడితే ఈ సినిమా బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా నిల్చింది. ట్రేడ్ పండితులు అందిస్తున్న సమాచారం ప్రకారం ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా అన్నీ ప్రాంతాలకు కలిపి 30 కోట్ల రూపాయిల ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ ని జరుపుకుంది. కేవలం తెలుగు రాష్ట్రాల నుండే ఈ సినిమాకి 22 కోట్ల రూపాయిల బిజినెస్ జరిగింది అట. ఈ సినిమా సోలో గా విడుదల అయ్యుంటే ఇది పెద్ద బ్రేక్ ఈవెన్ టార్గెట్ కాదు.

- Advertisement -

కానీ ఈ సినిమా విడుదలయ్యే రోజునే సూపర్ స్టార్ మహేష్ బాబు ‘గుంటూరు కారం’ విడుదల కాబోతుంది. హైదరాబాద్ వంటి సిటీస్ లలో ఈ చిత్రానికి కేవలం 5 సింగల్ థియేటర్స్ మాత్రమే దొరికే అవకాశం ఉంది. ఈ సినిమా తర్వాత సంక్రాంతికి వరుసగా నాలుగు సినిమాలు విడుదల అవ్వబోతున్నాయి. ఇంత పోటీ మధ్యలో ఈ సినిమా బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకుంటుందా అనేది ఇప్పుడు పెద్ద ప్రశ్న. చూడాలి మరి.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here