Hanuman Collections : చిన్న సినిమాలు పెద్ద సినిమాలను డామినేట్ చెయ్యడం మనం అనేకసార్లు చూసాము. కానీ మొదటి రోజు నుండి చిన్న సినిమా పెద్ద హీరో చిత్రాన్ని డామినేట్ చెయ్యడం కేవలం ‘హనుమాన్’ సినిమాకి మాత్రమే చూసాము. నిన్న సూపర్ స్టార్ మహేష్ బాబు హీరో గా నటించిన ‘గుంటూరు కారం’ చిత్రంతో పాటుగా ఈ సినిమా కూడా విడుదలైంది. పెద్ద హీరో సినిమాతో క్లాష్ అవసరమా అని అందరూ అనుకున్నారు.
కానీ విడుదల తర్వాత కథ అడ్డం తిరిగింది. ‘హనుమాన్’ సినిమాకి టికెట్స్ దొరకని వాళ్ళు, తప్పనిసరి పరిస్థితిలో ‘గుంటూరు కారం’ చిత్రానికి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. బుక్ మై షో యాప్ లో చూపిస్తున్న గణాంకాల ప్రకారం ‘హనుమాన్’ చిత్రానికి నిన్న ఒక్క రోజే నాలుగు లక్షల టిక్కెట్లు అమ్ముడుపోయాయని టాక్. మరో పక్క ‘గుంటూరు కారం’ చిత్రానికి కనీసం రెండు లక్షల 50 వేల టిక్కెట్లు కూడా అమ్ముడుపోలేదు.
ఓవర్సీస్ లో కూడా ఇదే రేంజ్ డామినేషన్. ‘గుంటూరు కారం‘ చిత్రానికి ప్రీమియర్స్ కాకుండా మొదటి రోజు మూడు లక్షల డాలర్ల గ్రాస్ వసూళ్లు వస్తే ‘హనుమాన్’ చిత్రానికి ఏకంగా 5 లక్షలకు పైగా గ్రాస్ వసూళ్లు వచ్చాయి. ఇక తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే నైజాం ప్రాంతం లో మొదటి రోజు దాదాపుగా నాలుగు కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను సాధించిన ఈ చిత్రం, రెండు తెలుగు రాష్ట్రాలకు కలిపి 8 కోట్ల రూపాయలకు పైగా షేర్, ప్రపంచవ్యాప్తంగా అన్నీ ప్రాంతాలకు కలిపి 14 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి.
ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ దాదాపుగా 25 కోట్ల రూపాయలకు జరిగింది. రెండవ రోజు మొదటి రోజుతో పోలిస్తే థియేటర్స్ గణనీయంగా పెరగగా, మొదటి రోజు కంటే ఎక్కువ వసూళ్లు వస్తాయని, బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకుంటుందని అంటున్నారు. ఇదే రేంజ్ ఊపులో ముందుకు పోతే ఈ సినిమా ఫుల్ రన్ లో 70 కోట్ల రూపాయిలను రాబట్టిన ఆశ్చర్యపోనక్కర్లేదని అంటున్నారు ట్రేడ్ పండితులు, చూడాలి మరి.