ప్రశాంత్ వర్మ దర్శకత్వం లో తేజా సజ్జల హీరో గా నటించిన ‘హనుమాన్’ చిత్రం రీసెంట్ గానే సంక్రాంతి కానుకగా భారీ అంచనాల నడుమ విడుదలై బాక్స్ ఆఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. చిన్న సినిమా పెద్ద సినిమాల మధ్య చిక్కుకొని ఏమి ఆడుతుందిలే అని అందరూ అనుకున్నారు. కానీ ఈ చిన్న సినిమానే నేడు పెద్ద సినిమా అయ్యింది.

ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద దుమ్ములేపాడమే కాకుండా, ఈ చిత్రం తో పాటు విడుదలైన సినిమాలకు కూడా కలెక్షన్స్ ని ఇస్తుంది. ఎలా అంటే ఈ చిత్రానికి టికెట్ దొరకని వాళ్ళు ‘గుంటూరు కారం’ మరియు ఇతర సంక్రాంతి సినిమాలకు వెళ్తున్నారు. ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ ప్రాంతాలలో ఇదే పరిస్థితి. ఇక ఓవర్సీస్ లో అయితే ఈ సినిమా స్టార్ హీరోలకు కూడా సాధ్యం కానీ 5 మిలియన్ మార్కుని అందుకునే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.

ఇదంతా పక్కన పెడితే ఈ సినిమా కోసం తేజ సజ్జల పడిన కష్టం గురించి రీసెంట్ గా జరిగిన ఒక ఇంటర్వ్యూ లో చెప్పుకొచ్చాడు. ఆయన మాట్లాడుతూ ‘ ఈ చిత్రం లో నేను రోకలి బండతో కొట్టుకునే సన్నివేశం ఒకటి ఉంటుంది. ఈ సన్నివేశం కారణంగా నా మెడ పూర్తిగా పట్టేసింది. మరుసటి రోజు షూటింగ్ చెయ్యడానికి చాలా ఇబ్బంది పడ్డాను. ఇక ఈ సినిమాలో హనుమాన్ శక్తులు నాకు వచ్చినప్పుడు గాల్లో తేలే సన్నివేశాలు ఉంటాయి.

ఈ సన్నివేశాల కోసం నేను రోప్స్ కట్టుకొని ఆరు గంటల పాటు గాల్లోనే ఉండాల్సి వచ్చింది. క్లైమాక్స్ సన్నివేశం కోసం దాదాపుగా 40 రోజుల సమయం పట్టింది. ఈ 40 రోజులు నేను విపరీతమైన దుమ్ము, పొగని చూడాల్సి వచ్చింది. దాని వల్ల నా కంటి చూపు దెబ్బ తినింది. ఒక కన్ను పూర్తిగా పనిచేయలేదు. డాక్టర్ దగ్గరకి వెళ్తే సర్జరీ చేయించుకోమని చెప్పాడు. సినిమా విడుదలయ్యే వరకు చేయించుకొనని చెప్పాను’ అంటూ తేజా సజ్జ రీసెంట్ గా జరిగిన సక్సెస్ మీట్ లో చెప్పుకొచ్చాడు.
