Jai Hanuman : తేజ సజ్జ ప్రధాన పాత్రలో యంగ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ దర్శకత్వం తెరకెక్కిన చిత్రం హను-మాన్. టాలీవుడ్ సూపర్ హీరో మూవీగా తెరకెక్కిన ఈ చిత్రం ఈ ఏడాది సంక్రాంతి సందర్భంగా విడుదల అయింది. ఈ ఏడాదిలో బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి వంద కోట్లకుపైగా వసూళ్లు రాబట్టిన తొలి తెలుగు చిత్రంగా నిలిచింది. ఇక అక్కడి నుంచి ఆ జైత్రయాత్ర కొనసాగుతూనే ఉంది. ఎంతలా అంటే.. ఈ చిత్రం వివిధ భాషల్లో ఓటీటీలో విడుదలైనా.. ఇంకా థియేటర్లలో ఆడే అంతలా. ఈ విజువల్ వండర్ ను థియేటర్లో చూస్తే వచ్చే మజాయే వేరు.

ఇక ఈ చిత్రానికి సీక్వెల్ ఉంటుందని హను-మాన్ మూవీలో ఎండింగ్ లో హింట్ ఇచ్చిన విషయం తెలిసిందే. జై హనుమాన్ పేరుతో ఈ సీక్వెల్ తెరకెక్కుతోంది. ఇప్పటికే స్క్రిప్టు వర్క్ పూర్తయింది. త్వరలోనే షూటింగ్ షురూ కానుంది. అయితే ఈ మూవీలో బాలీవుడ్ స్టార్ హీరో ప్రధాన పాత్రలో నటించనున్నట్లు టాక్ వినిపిస్తోంది. మరోవైపు హను-మాన్ మూవీలో తేజ సజ్జ నటించిన హనుమంతు పాత్ర జై హనుమాన్ లో చాలా తక్కువ సేపే కనిపించనున్నట్లు సమాచారం.
ఇవాళ హనుమాన్ జయంతి సందర్భంగా జై హనుమాన్ టీమ్ ఓ కీలక అప్డేట్ ఇచ్చింది. దర్శకుడు ప్రశాంత్ వర్మ ఈ చిత్రం గురించి ఓ ఇంట్రెస్టింగ్ విషయాన్ని సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ‘జై హనుమాన్’ మూవీని ఐమ్యాక్స్ 3డీ ఫార్మాట్‌లో విడుదల చేయనున్నట్లు ప్రకటించాడు. అంతేకాదు, ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్‌లో వచ్చే ప్రతీ సినిమానూ ఐమ్యాక్స్ 3డీ వెర్షన్‌లోనే తీసుకురానున్నట్లు చెప్పాడు.
ఈ పోస్టులో ఓ పోస్టర్ ను కూడా రిలీజ్ చేశారు. నిప్పులు కక్కుతున్న డ్రాగన్ ఎదురుగా హనుమాన్ నిలబడి ఉన్న పోస్టర్ ఇప్పుడు ప్రేక్షకుల్లో ఈ సినిమా పట్ల హైప్ క్రియేట్ చేశాడు. ఇప్పటివరకూ చైనా మూవీలకే పరిమితమైన డ్రాగన్ కాన్సెప్ట్ ఇప్పుడు ఇండియా సినిమాలోనూ అలరించడానికి వస్తుందన్నమాట. అయితే ఈ మూవీలో హనుమాన్ డ్రాగన్లతో ఫైట్ చేస్తాడని నెటిజన్లు అనుకుంటున్నారు. అంటే హాలీవుడ్ క్రియేచర్ విలన్ తో మన టాలీవుడ్ సూపర్ హీరో ఫైట్ చేస్తాడన్నమాట.
మరోవైపు పాన్ ఇండియా స్థాయిలో రూపొందిస్తున్న చిత్రం కావడంతో బాలీవుడ్‌కు చెందిన పలువురు నటీనటులు ఇందులో నటించనున్నట్లు టాక్. ‘హను-మాన్’ పూర్తిగా తక్కువ బడ్జెట్ లో తీసిన సినిమా. బడ్జెట్ తక్కువ అయినా అద్భుతమైన అవుట్‌పుట్ ఇచ్చారంటూ విమర్శకులు సైతం టీమ్‌ను మెచ్చుకున్నారు. రాబోయే ‘జై హనుమాన్’ తొలి భాగాన్ని మించి ఉండేలా సినిమా తీయాలని ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు. భారతీయ ప్రేక్షకులకు చక్కటి సినిమాటిక్ ఎక్స్‌పీరియన్స్ ఇచ్చేందుకు ఐమ్యాక్స్ 3డీ వెర్షన్ కాన్సెప్ట్‌ను తీసుకొచ్చారు. తాజా ప్రకటనతో సీక్వెల్‌పై మరిన్ని అంచనాలు పెరిగాయి.
On this auspicious #HanumanJanmotsav ,
May we all stand against all the adversities and emerge victorious 🔥Experience the epitome of Lord #Hanuman ji‘s EPIC BATTLES in IMAX 3D💥#JaiHanuman @ThePVCU pic.twitter.com/VL94DyyPMj
— Prasanth Varma (@PrasanthVarma) April 23, 2024