Hansika Motwani : బాలనటిగా మంచి గుర్తింపుని దక్కించుకొని ఆ తర్వాత పూరి జగన్నాథ్ మరియు అల్లు అర్జున్ కాంబినేషన్ లో తెరకెక్కిన ‘దేశముదురు’ చిత్రం ద్వారా హీరో గా ఇండస్ట్రీ కి పరిచయమై మంచి క్రేజ్ ని దక్కించుకున్న హీరోయిన్ హన్సిక. ఈమె టాలీవుడ్ మరియు కోలీవుడ్ లో దాదాపుగా అగ్ర హీరోలందరితో కలిసి సినిమాలు చేసింది. కానీ ఎక్కువగా తమిళంలోనే ఈమెకి అవకాశాలు ఫుల్లుగా వస్తున్నాయి. అక్కడ యూత్ ఆడియన్స్ లో ఈమెకి ఉన్న క్రేజ్ మామూలుది కాదు.

రీసెంట్ గానే ఈమెకి పెళ్లి కూడా అయిపోయింది. పెళ్ళైన తర్వాత కూడా వరుసగా సినిమాలు చేస్తూ దూసుకుపోతుంది. కానీ ఆమె చేస్తున్న సినిమాలు ఎక్కువగా డైరెక్ట్ ఓటీటీ వి అవ్వడం గమనార్హం. ఇదంతా పక్కన పెడితే ఇంత వయస్సు వస్తున్నా కూడా హన్సిక అంత యంగ్ గా, నేటి తరం కుర్ర హీరోయిన్స్ తో సమానంగా అందంగా ఉండడానికి కారణం ఏమిటి అని సోషల్ మీడియా లో చర్చలు చాలా రోజుల నుండి నడుస్తూనే ఉన్నాయి.

హార్మోన్ ఇంజెక్షన్స్ వాడకం అధికంగా ఉండడం వల్లే హన్సిక ఇంత యంగ్ గా, అందం గా ఉండడానికి కారణం అంటూ సోషల్ మీడియా లో ఒక వార్త తెగ ప్రచారం అయ్యింది. దీనిపై హన్సిక రీసెంట్ గా జరిగిన ఒక ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ ‘ ఈ వార్తలు నాకంటే మా అమ్మని ఎక్కువ బాధించింది. సోషల్ మీడియాలో ప్రతీ ఒక్కరికి మాట్లాడే స్వేచ్ఛ ఉంటుంది. కానీ స్వేచ్ఛ ఉంది కదా అని ఏది పడితే అది రాస్తే కుటుంబం మొత్తం బాధపడాల్సి ఉంటుంది. నా విషయం లో అదే జరిగింది. మా కుటుంబం మొత్తం ఇప్పటి వరకు ఇలాంటి రూమర్స్ వినలేదు. వాళ్ళు ఇలాంటి రూమర్స్ ని తీసుకోలేరు కూడా. ఈ రూమర్స్ నా హుర్దయాన్ని ఎంతో బాధపెట్టాయి. ముఖ్యంగా ఈ వార్తల వల్ల మా అమ్మ పడుతున్న బాధని చూసి ఏడ్చేసాను’ అంటూ చెప్పుకొచ్చింది హన్సిక.