Hansika : పెళ్లిలో తన తల్లి చేసిన పనికి గుక్కపెట్టి ఏడ్చిన హన్సిక

- Advertisement -

Hansika : యాపిల్ బ్యూటీ హన్సిక తన బాయ్ ఫ్రెండ్ సోహైల్ ను పెళ్లి చేసుకుని ప్రస్తుతం మ్యారిడ్ లైఫ్ ను తెగ ఎంజాయ్ చేస్తోంది. గతేడాది సోహైల్ తో ఈ భామ వివాహ బంధంలోకి అడుగుపెట్టింది. రాజస్థాన్ లో మూడు రోజుల పాటు వీరి వివాహ వేడుక అత్యంత ఘనంగా.. అంగరంగ వైభవంగా జరిగింది. ఈ వేడుకలను లవ్ షాదీ డ్రామా అనే పేరుతో డిస్నీ ప్లస్ హాట్ స్టార్ డాక్యుమెంటరీ కూడా తీసింది. ప్రస్తుతం లవ్ షాదీ డ్రామ్ పేరుతో హన్సిక-సోహైల్ వెడ్డింగ్ స్టోరీ హాట్ స్టార్ ఓటీటీలో రెండు వారాల నుంచి ప్రసారం అవుతోంది.

Hansika
Hansika

ఎపిసోడ్ లుగా రిలీజ్ అవుతున్న హన్సిక వెడ్డింగ్ డ్రామాలో ఒక్కో ఎపిసోడ్ లో ఒక్కో ఆసక్తికరమైన విషయాలను ఈ బ్యూటీ అభిమానులతో షేర్ చేసుకుంటోంది. ఇప్పటికే సోహైల్ మొదటి భార్యకు విడాకులు ఇవ్వడానికి తానే కారణమని వస్తోన్న వార్తలపై హన్సిక క్లారిటీ ఇచ్చింది. ఆ తర్వాత ఎపిసోడ్ లో హన్సిక కు హీరోయిన్ ఛాన్స్ కోసమని.. తన తల్లి చిన్నప్పుడే వయసు పెరిగిన అమ్మాయిలా కనిపించడానికి హార్మోనల్ ఇంజక్షన్ ఇచ్చిందని వచ్చిన పుకార్లపై క్లారిటీ ఇచ్చింది.

Actress Hansika
Actress Hansika

తాజాగా విడుదలైన ఎపిసోడ్‌లో పెళ్లికి ముందు హన్సిక కుటుంబంలో జరిగిన అమ్మవారి పూజా కార్యక్రమం, వెడ్డింగ్‌ డ్రెస్‌ షాపింగ్‌ వంటివి చూపించారు. ఇందులో భాగంగా కన్యాదానం విషయంలో తాను తీసుకున్న ఓ నిర్ణయాన్ని తన కుమార్తెకు వివరిస్తూ హన్సిక తల్లి కనిపించారు. తన తల్లి ఆ విషయంలో తీసుకున్న నిర్ణయం చూసి హన్సిక గుక్కపెట్టి ఏడ్చిందట. 

- Advertisement -
Hansika Motvani

‘‘కుటుంబంలో అందరి కంటే నువ్వే నాకు ఎక్కువ. ప్రతి అమ్మాయికీ ఆత్మ గౌరవం ఎంతో ముఖ్యం. నీ వల్లే అది నాకు మరింత పెరిగింది. నిన్ను చూస్తుంటే నాకెంతో గర్వంగా ఉంది. ఇబ్బందులు ఎదుర్కొని.. విమర్శలు దాటుకుని.. ఈ స్థాయికి వచ్చావు. పెళ్లి విషయంలో నేను కన్యాదానం చేయకూడదని ఓ నిర్ణయం తీసుకున్నా. ఎందుకంటే, నువ్వేమీ వస్తువు కాదు వేరొకరికి దానం చేయడానికి. కన్యాదానానికి బదులు గోదానం చేస్తాను. అలాగే, పెళ్లి అయినా సరే నువ్వు ఎప్పటికీ ఈ ఇంటి కుమార్తెవే’’ అంటూ తల్లి చెప్పడంతో హన్సిక తీవ్ర భావోద్వేగానికి గురైంది. తల్లి తీసుకున్న నిర్ణయం తనకెంతో నచ్చిందని, ఇది చాలా గొప్ప విషయమని చెప్పింది. ఈ ఎపిసోడ్ ప్రస్తుతం డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. 

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here