Jyothi Rai : మా టీవీలో ప్రసారమయ్యే గుప్పెడంత మనసు సీరియల్ అంటే పడి చచ్చిపోయే ప్రేక్షకులు లక్షలాది మంది ఉన్నారు. ఇందులో నటి జగతి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. నటుడు రిషికి తల్లిగా నటించి అందరి మనన్నలు అందుకుంటోంది. ని ఆమె అసలు పేరు జ్యోతి రాయ్. వాస్తవానికి ఆమెది కన్నడ ఇండస్ట్రీ. గతంలో ఆమె పలు సినిమాల్లో హీరోయిన్ గా నటించి మెప్పించింది. తర్వాత బుల్లి తెరపై తెలుగులో గుప్పెడంత మనసు సీరియల్ ద్వారా బాగా పాపులర్ అయింది.

తాను సోషల్ మీడియాలో తాను చాలా యాక్టివ్ గా ఉంటుంది. నిరంతరం తన హాట్ హాట్ ఫోటోలు షేర్ చేస్తూ చర్చనీయాంశంగా ఉంటుంది. అయితే గత కొద్ది రోజులుగా ఆమె ఓ డైరెక్టర్ ను పెళ్లి చేసుకోబోతుంది అంటూ వార్తలు వచ్చాయి. సీరియల్స్ లో చాలా పద్ధతిగా ఆంటీ పాత్రల్లో కనిపించే జ్యోతీ రాయ్ సోషల్ మీడియాలో మాత్రం ఓ రేంజ్ లో అందాల ఆరబోతతో కుర్రాళ్ల మతులు పోగొట్టుతోంది. ఇలా చేసేది తను ఓ వెబ్ సిరీస్ కోసమని తెలుస్తోంది.
ఆ వెబ్ సిరీస్ పేరే ది ప్రెట్టి గర్ల్.. ది గుడ్ వైఫ్ క్యాస్టల్ అనేది వెబ్ సిరీస్ ట్యాగ్ లైన్. రాహుల్ దీపక్ దీనిని తెరకెక్కిస్తున్నారు. ఈమె నటిస్తోన్న సిరీస్ పోస్టర్ తన సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. సిరీస్ మేకర్స్ కు థ్యాంక్స్ చెబుతూ పోస్టర్లో జ్యోతి రాయ్ లుక్ టూ హాట్ అని చెప్పవచ్చు. రెడ్ కలర్ మినీ స్కర్ట్ లో తన అందాలు నిక్కబొచుకు వస్తుండగా ఆ ఫోటోలు చూసిన నెటిజన్స్ అంటీ టూ హాట్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.