‘సర్కారు వారి పాట’ తర్వాత సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తో కలిసి ‘గుంటూరు కారం’ అనే చిత్రం చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ సినిమాకి సంబంధించిన టీజర్ కృష్ణ గారి జయంతి రోజున విడుదల చెయ్యగా, ఫ్యాన్స్ నుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. కానీ సినిమా ప్రారంభమైన రోజు నుండి నేటి వరకు ఎదో ఒక అడ్డంకి తగలడం, షూటింగ్ ఆగిపోవడం వంటివి జరుగుతూనే ఉన్నాయి.

దీంతో అభిమానుల్లో ఈ సినిమా ఆడుతుంది అనే నమ్మకం పోయింది. ఔట్పుట్ మీద చాలా అనుమానాలు మొదలయ్యాయి. పైగా త్రివిక్రమ్ రైటింగ్ మీద ఫ్యాన్స్ లో చాలా అనుమానాలు మొదలు అయ్యాయి. ఎందుకంటే రీసెంట్ గా పవన్ కళ్యాణ్ హీరో గా నటించిన ‘భీమ్లా నాయక్’ మరియు ‘బ్రో ది అవతార్’ చిత్రాలకు డైలాగ్స్ ఆశించిన స్థాయిలో రాయలేదు త్రివిక్రమ్. దాంతో అప్పటి నుండి ఫ్యాన్స్ లో అంచనాలు బాగా తగ్గిపోయాయి.

ప్రస్తుతం మహేష్ బాబు తన కుటుంబం తో కలిసి ఫారిన్ ట్రిప్ లో ఉన్నాడు, ఆయన ఇక్కడికి ఎప్పుడు తిరిగి వస్తాడో, ఎప్పుడు కొత్త షెడ్యూల్ ప్రారంభం అవుతుందో అనే దానిపై ఎవరికీ క్లారిటీ లేదు. ఇదంతా చూస్తుంటే అసలు ఈ సినిమా పూర్తి అవ్వుద్దా, లేదా మధ్యలోనే ఆగిపోతాడా అనే అనుమానం అందరిలో మొదలైంది. ఇకపోతే రేపు మహేష్ బాబు పుటిన రోజు సందర్భంగా ‘గుంటూరు కారం ‘ చిత్రం నుండి మొదటి పాట కానీ, లేదా చిన్న గ్లిమ్స్ వీడియో కానీ విడుదల అవుతుందని అందరూ భావించారు.

కానీ అవేమి విడుదల అవ్వడం లేదట. ఇది అభిమానులకు తీవ్రమైన నిరాశని కలిగించే విషయం. ఈ చిత్రాన్ని జనవరి 13 వ తారీఖున విడుదల చేస్తామని దర్శక నిర్మాతలు ఇది వరకే అధికారికంగా ప్రకటించారు. కానీ ఇప్పుడు ఆ తేదీన విడుదల అయ్యే ఛాన్స్ లేదని అంటున్నారు. సమ్మర్ కి ఈ చిత్రాన్ని వాయిదా వేసే అవకాశం ఉంటుందని అంటున్నారు. చూడాలి మరి.
