Guntur Kaaram : శ్రీలీల టాలీవుడ్ చరిత్రలో ఈ పేరుకు వచ్చినంత క్రేజ్ మరే హీరోయిన్ కు ఇంతవరకు రాలేదంటే అతిశయోక్తి కాదు. అమ్మడు ఎంత అదృష్టవంతురాలంటే ఫ్లాప్ అయిన సినిమాతో కూడా లక్ ని తన వెంట వచ్చేలా చేసుకుంది. టాలీవుడ్ క్రష్ గా పాపులారిటీ సంపాదించుకున్న శ్రీలీల అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ గా మారిపోయింది. అమ్మడి అదృష్టమో లేక టాలెంటో తెలియదు కానీ ఆమె నటించిన సినిమాలు ఫ్లాప్ అయినా సరే.. అవి మాత్రం ఆమెకు మంచి పేరు ప్రఖ్యాతలు తీసుకొస్తున్నాయి. రీసెంట్ గా తాను మహేశ్ తో కలిసి నటించిన సినిమా గుంటూరు కారం. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రపంచ వ్యాప్తంగా విడుదలై కలెక్షన్ల సునామీ సృష్టించింది.

టాక్ పరంగా ఇలాంటి సినిమా ఎలా చేశారన్న కామెంట్స్ దక్కించుకున్నా. హిట్టు ఫ్లాప్ లను పెద్దగా పట్టించుకోని మహేష్ బాబు.. ఈ కామెంట్స్ ని లైట్ గా తీసుకున్నారు. అయితే ఈ సినిమా ఫ్లాప్ అంటూ శ్రీలీలను దారుణంగా ట్రోల్ చేశారు ఆకతాయిలు. సినిమాలో తన పాత్ర ఏమీ లేదని .. కేవలం ఆమెను నువ్వు డ్యాన్స్ కే పనికి వచ్చావంటూ పచ్చి బూతులు తిట్టారు. అయితే ఇప్పుడు ఆ బూతులే ఆమె పాలిట వరంగా మారాయి. శ్రీలీలకు గుంటూరు కారం సినిమా ఫ్లాప్ అయిన కారణంగా ఓ బంపర్ ఆఫర్ తన చేతికి వచ్చిందట.

ఎప్పటినుంచో ఫిమేల్ ఓరియంటెడ్ సినిమా చేయాలనుకుంటున్న శ్రీలీలకు ఈ సినిమా మంచి లక్ ని తీసుకొచ్చిందట. త్వరలోనే తెరకెక్కబోతున్న లేడీ ఓరియంటెడ్ సినిమాలో శ్రీ లీల ఛాన్స్ అందుకుందట. అంతేకాదు ఇది ఫుల్ టు ఫుల్ లేడీ ఓరియంటెడ్ సినిమా. ఓ అమ్మాయి డ్యాన్స్ అంటే ఇష్టం ఉండి చదువుకుంటూ కుటుంబ బాధ్యతలను తీసుకుంటూ ఎలా నెట్టుకొచ్చింది అనేది సినిమా స్టోరీ . ఈ సినిమాలో శ్రీలీల మెయిన్ లీడ్ గా నటించబోతుందట. దీంతో శ్రీలీల ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. సినిమా గుంటూరు కారం ఫ్లాప్ పైన నీకు అంతా బాగానే కలిసి వచ్చింది అంటూ పొగిడేస్తున్నారు.