Guntur Kaaram : సూపర్ స్టార్ మహేష్ బాబు హీరో గా నటించిన లేటెస్ట్ చిత్రం ‘గుంటూరు కారం’ రీసెంట్ గా సంక్రాంతి కానుకగా భారీ అంచనాల నడుమ విడుదలై బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొట్టిన సంగతి తెలిసిందే. మహేష్ బాబు లాంటి సూపర్ స్టార్ తో ఇంత చీప్ ప్రోడక్ట్ ఇప్పటి వరకు ఎవ్వరూ తియ్యలేదని, త్రివిక్రమ్ శ్రీనివాస్ ని నమ్మి మోసపోయాం అంటూ మహేష్ ఫ్యాన్స్ విడుదల రోజు నుండి నేటి వరకు త్రివిక్రమ్ ని తిడుతూనే ఉన్నారు.

మొదటి రోజు కాంబినేషన్ క్రేజ్ కారణంగా పర్వాలేదు అనే రేంజ్ ఓపెనింగ్ వచ్చినప్పటికీ, రెండవ రోజు నుండి మాత్రం వసూళ్లు దారుణంగా పడిపోయాయి. కానీ భోగి రోజు ఒక మోస్తరుగా కలెక్షన్స్ పిక్ అయ్యాయి, నిన్న సంక్రాంతి సందర్భంగా అన్నీ ప్రాంతాలలో హౌస్ ఫుల్స్ పడ్డాయి. ఈరోజు కనుమ పండుగ కాబట్టి, నేడు కూడా ఈ సినిమాకి మంచి వసూళ్లు రావొచ్చు.

నైజాం ప్రాంతం లో ఇక వసూళ్లు వచ్చే ఛాన్స్ లేదు కానీ, ఆంధ్ర లో మాత్రం నేడు మంచి వసూళ్లు వస్తాయి. ఇక ఈరోజు వచ్చే వసూళ్లే ఫైనల్ అని, రేపటి నుండి ఈ సినిమాకి షేర్స్ రావడం కష్టమే అని అంటున్నారు ట్రేడ్ పండితులు. అనేక ప్రాంతాలలో ‘గుంటూరు కారం’ చిత్రాన్ని పూర్తిగా థియేటర్స్ నుండి తొలగించి ‘హనుమాన్‘ లేదా ‘నా సామి రంగ’ సినిమాలకు కేటాయించబోతున్నారు బయ్యర్స్.

ఈ సినిమా ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ దాదాపుగా 140 కోట్ల రూపాయలకు జరిగింది. ఇప్పటి వరకు 70 కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లు వచ్చాయి, మరో 5 కోట్లు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి నేడే ఈ చిత్రానికి చివరి మంచి రోజని అంటున్నారు ట్రేడ్ పండితులు. చూడాలి మరి ఫుల్ రన్ లో ఎక్కడ దాకా వెళ్లి ఆగుతుంది అనేది.