Guntur Kaaram vs Hanuman : సూపర్ స్టార్ మహేష్ బాబు లేటెస్ట్ చిత్రం ‘గుంటూరు కారం’ నేడు ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదలై మొదటి ఆట నుండి ఫ్లాప్ టాక్ తెచ్చుకున్న సంగతి తెలిసిందే. మహేష్ బాబు తన అద్భుతమైన నటనతో సినిమాని నిలబెట్టే ప్రయత్నం చేసినప్పటికీ, త్రివిక్రమ్ శ్రీనివాస్ బలహీనమైన స్క్రీన్ ప్లే రైటింగ్ వల్ల ఈ చిత్రం ఫ్యాన్స్ అంచనాలు అందుకోలేకపోవడానికి కారణం అయ్యిందంటూ ప్రధానంగా వినిపిస్తున్న టాక్.
ఈ నెగటివ్ టాక్ ప్రభావం సినిమా మీద చాలా బలంగా పడిందనే చెప్పాలి. మహేష్ – త్రివిక్రమ్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా కాబట్టి ఓపెనింగ్స్ కచ్చితంగా దుమ్ము లేచిపోతాది, టాక్ తో అసలు సంబంధమే లేకుండా సంక్రాంతి సెలవలు వరకు ఆడేస్తుందని అనుకున్నారు. ఆ నమ్మకంతో హైదరాబాద్ వంటి సిటీస్ బుక్ మై షో యాప్ లో టికెట్స్ మొత్తం బ్లాక్ చేసి పెట్టారు. కానీ టాక్ బయటకి లీక్ అయ్యి,ఆ టికెట్స్ అమ్ముడుపోకవడం తో మళ్ళీ బుక్ మై షో లో టికెట్స్ ని పెట్టేసారు.
దీనిపై నెటిజెన్స్ సోషల్ మీడియా లో ఇప్పుడు పెద్ద ఎత్తున ట్రోల్ల్స్ చేస్తున్నారు. ఇది ఇలా ఉండగా ఈ సినిమాతో పాటుగా విడుదలైన ‘హనుమాన్’ చిత్రానికి అల్ట్రా పాజిటివ్ టాక్ రావడం వల్ల ‘గుంటూరు కారం’ చిత్రం పై తీవ్రమైన ప్రభావం పడుతుందని ట్రేడ్ పండితుల అభిప్రాయం. ‘గుంటూరు కారం’ సినిమాకి టికెట్స్ బుక్ చేసుకున్నోళ్ళు క్యాన్సిల్ చేసుకొని ‘హనుమాన్’ కి బుక్ చేసుకుంటున్నారు.
బుక్ మై షో యాప్ ని ఒకసారి తెరిచి చూస్తే ‘హనుమాన్’ చిత్రానికి గంటకు 20 వేలకు పైగా టికెట్స్ అమ్ముడుపోగా, ‘గుంటూరు కారం’ చిత్రానికి కేవలం 16 వేల టిక్కెట్లు మాత్రమే అమ్ముడుపోయాయి. రేపటి నుండి ప్రధాన నగరాల్లో గుంటూరు చిత్రానికి కేటాయించిన థియేటర్స్ ని ‘హనుమాన్’ కి ఇచ్చేస్తున్నారు బయ్యర్స్. ఇప్పుడు సంక్రాంతి ఆడియన్స్ కి మొట్టమొదటి ఛాయస్ ‘హనుమాన్‘ అయ్యింది, ఇక బాక్స్ ఆఫీస్ లెక్క ఎక్కడ దాకా వెళ్లి ఆగుతుందో చూడాలి.