Guntur Kaaram : కోట్లాది మంది అభిమానులు, ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని వెయ్యి కళ్ళతో ఎదురు చూసిన సూపర్ స్టార్ మహేష్ బాబు ‘గుంటూరు కారం’ చిత్రం నిన్న ప్రపంచవ్యాప్తంగా విడుదలై మొదటి ఆట నుండే భారీ డిజాస్టర్ టాక్ ని సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. మహేష్ బాబు ఇలాంటి చెత్త కథని ఎలా ఒప్పుకున్నాడు అంటూ ఆయన అభిమానులు సోషల్ మీడియా లో తిట్టసాగారు.

ఒక్కటంటే ఒక్క సన్నివేశం కూడా డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ సరిగా తియ్యలేకపోయాడని, మహేష్ బాబు ఎనర్జీ మొత్తం బూడిదలో పోసిన పన్నీరు అయ్యిందని బాధపడ్డారు. సినిమా టాక్ సరిగా రాలేదు కానీ, ఓపెనింగ్స్ లో మాత్రం మహేష్ బాబు ఇంత ఫ్లాప్ టాక్ లో కూడా తన సత్తా ఏంటో చూపించారు. మొదటి రోజు ఈ చిత్రానికి పలు ప్రాంతాలలో ఆల్ టైం రికార్డ్స్ మరియు నాన్ రాజమౌళి రికార్డ్స్ వచ్చాయి.

ముఖ్యంగా ఓవర్సీస్ లోని నార్త్ అమెరికా లో ఈ చిత్రానికి ప్రీమియర్స్ + మొదటి రోజు కలిపి దాదాపుగా రెండు మిలియన్ డాలర్ల వసూళ్లు వచ్చాయి. అలాగే నైజాం ప్రాంతం లో రికార్డుని నెలకొల్పలేకపోయింది కానీ, మొదటి రోజు దాదాపుగా 12 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. టికెట్ రేట్స్ మరియు భారీ షోస్ తో విడుదలైన ఈ సినిమాకి అది చాలా తక్కువ వసూళ్ళు అని చెప్పొచ్చు.

మొత్తం మీద రెండు తెలుగు రాష్ట్రాలకు కలిపి ఈ సినిమాకి మొదటిరోజు 32 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు, ప్రపంచవ్యాప్తంగా 44 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయని అంటున్నారు ట్రేడ్ పండితులు. కానీ రెండవ రోజు నుండి ఈ సినిమాకి అసలు సిసలు పరీక్ష మొదలు కానుంది. సంక్రాంతి సెలవులు కాబట్టి ఈ చిత్రం అవలీల గా 80 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను రాబడుతుందని అంచనా. ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ అన్నీ ప్రాంతాలకు కలిపి 150 కోట్ల రూపాయలకు జరిగింది. ఎంత వరకు రికవర్ చేస్తుందో చూడాలి.
