Guntur Kaaram : వరుస బ్లాక్ బస్టర్ హిట్స్ తో దూసుకుపోతున్న సూపర్ స్టార్ మహేష్ దూకుడు కి రీసెంట్ గా విడుదలైన ‘గుంటూరు కారం’ చిత్రం బ్రేకులు వేసింది. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం లో భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ చిత్రం, ఆ అంచనాలను అందుకోవడం లో తీవ్రంగా విఫలం అయ్యింది. కానీ సంక్రాంతి సెలవుల పుణ్యమా అని ఈ చిత్రం కోస్తాంధ్ర ప్రాంతం లో మాత్రం మంచి వసూళ్లను రాబట్టింది.
కానీ నైజాం, ఓవర్సీస్, కర్ణాటక, తమిళనాడు అంటి ప్రాంతాలలో మాత్రం ఘోరమైన డిజాస్టర్ ఫ్లాప్ గా మిగిలింది ఈ చిత్రం. పండగ ముగిసిన తర్వాత అనేక ప్రాంతాలలో షేర్ వసూళ్లు రావడం ఆగిపోయింది. ఓవరాల్ గా థియేట్రికల్ రన్ ని ముగించుకున్న ఈ చిత్రానికి ప్రపంచవ్యాప్తంగా ఫుల్ రన్ లో ఎంత వసూళ్లు వచ్చాయో ఈ ఆర్టికల్ లో చూద్దాము.
నైజాం ప్రాంతం లో ఈ చిత్రానికి విడుదలకు ముందు 45 కోట్ల రూపాయిల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. కానీ ఫుల్ రన్ లో ఈ చిత్రానికి కేవలం 24 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు మాత్రమే వచ్చింది. అంటే ఈ ఒక్క ప్రాంతం నుండే దాదాపుగా 20 కోట్ల రూపాయలకు పైగా నష్టం వాటిల్లింది అన్నమాట. నైజాం తర్వాత ఈ సినిమాకి అత్యధిక నష్టాలను తెచ్చిపెట్టిన ప్రాంతం సీడెడ్. దాదాపుగా 13 కోట్ల రూపాయిల ప్రీ రిలీజ్ బిజినెస్ ని జరుపుకున్న ఈ సినిమాకి ఫుల్ రన్ లో 8 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు కూడా రాలేదు.
ఇక కర్ణాటక ప్రాంతం లో అయితే ఈ సినిమాకి 12 కోట్ల రూపాయిల ప్రీ రిలీజ్ బిజినెస్ జరగగా, ఫుల్ రన్ లో 5 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను కూడా రాబట్టలేకపోయింది. నార్త్ అమెరికా లో రెండు మిలియన్ డాలర్ల షేర్ నష్టాన్ని దక్కించుకున్న ఈ సినిమా, ఓవరాల్ ఓవర్సీస్ లో నాలుగు మిలియన్ డాలర్ల నష్టాన్ని అందుకుంది. కేవలం కోస్తాంధ్ర లో మాత్రం 40 కోట్ల రూపాయిల షేర్ ని రాబట్టి పర్వాలేదు అనిపించుకుంది ఈ చిత్రం. అలా ఓవరాల్ గా ఈ సినిమా 92 కోట్ల రూపాయిల షేర్ ని రాబట్టి 40 కోట్ల రూపాయలకు పైగా నష్టాలను చవిచూసింది.