Guess The Actress : క్రింద ఫొటోలో ఎంతో క్యూట్ గా కనిపిస్తున్న ఈ చిన్నారిని ఎవరైనా గుర్తు పట్టారా..?, ఈమె కేవలం ఒకే ఒక్క టీజర్ తో పాపులర్ అయ్యింది. అది కూడా మామూలుగా కాదు, ఇండియా మొత్తం షేక్ అయ్యింది. పార్లమెంట్ లో కూడా దీని గురించి చర్చ నడిచింది. ఇక కుర్రకారులు అయితే ఆమెకి ఫిదా అయిపోయారు, సోషల్ మీడియా లో ఎక్కడ చూసిన ఈ బ్యూటీ నే కనిపించేది. అంతటి సెన్సేషన్ సృష్టించిన ఈ అమ్మాయికి ఇప్పటి వరకు సరైన సక్సెస్ లేకపోవడం బాధాకరం.

ఇంతకీ ఆ హీరోయిన్ మరెవరో కాదు, ఆమె పేరు ప్రియా ప్రకాష్ వారియర్.’ఓరు ఆధార్ లవ్’ అనే సినిమా ద్వారా ఇండస్ట్రీ కి పరిచయమైనా ఈమె, ఆ సినిమా సక్సెస్ కాకపోవడం తో క్రేజీ హీరోయిన్ గా మారలేకపోయింది. కానీ అవకాశాలు మాత్రమే బాగానే వచ్చాయి, ఇప్పటికీ కూడా వస్తూనే ఉన్నాయి, ప్రస్తుతం పవన్ కళ్యాణ్ మరియు సాయి ధరమ్ తేజ్ కాంబినేషన్ లో వస్తున్నా ‘బ్రో ది అవతార్’ అనే సినిమాలో ఒక హీరోయిన్ గా నటిస్తుంది.

ఈ చిత్రం వచ్చే నెల 28 వ తారీఖున గ్రాండ్ గా విడుదల కాబోతుంది, పవన్ కళ్యాణ్ సినిమాలో ఛాన్స్ అంటే షధారణమైన విషయం కాదు, హిట్ అయినా ఫ్లాప్ అయినా ఆయనతో కలిసి నటించిన ప్రతీ ఒక్కరికీ మంచి గుర్తింపు మరియు రీచ్ వస్తుంది. ఇక ఈ సినిమా ఆమె కెరీర్ కి ఎంత ఉపయోగపడుతుందో చూడాలి.

ఇక ఈ బ్యూటీ సోషల్ మీడియా లో తనకి సంబంధించిన ఫోటోలు మరియు రీల్స్ ని అప్లోడ్ చేస్తూ ఎప్పుడు ట్రెండింగ్ లోనే ఉంటుంది అనే విషయం అందరికీ తెలిసిందే. ఇప్పటి వరకు ఈమె హీరోయిన్ గా నటించిన సినిమాలు నాలుగు మాత్రమే ఉన్నాయి. అది పక్కన పెడితే, ‘బ్రో’ చిత్రం తో పాటుగా మరో ఆరు సినిమాల్లో హీరోయిన్ గా నటిస్తుంది. వీటిల్లో నాలుగు సినిమాలు హిందీ భాషకి సంబంధించినవే అవ్వడం విశేషం.