Guess The Actress : కొంతమంది చిన్నారులు మనం చూస్తూ ఉండగానే ఎవ్వరు అందుకోలేనంత ఉన్నత శిఖరాలకు చేరుకుంటుంటారు. ఒకసారి వెనక్కి వెళ్లి చూస్తే ఇంత చిన్న స్థాయి నుండి, ఏ రేంజ్ కి ఎదిగిపోయారు అని అనిపిస్తుంది. క్రింద మహేష్ బాబు తో ఫోటో దిగిన ఈ అమ్మాయి జర్నీ అలాంటిదే. ఈ అమ్మాయి పేరు అవంతిక. హైదరాబాద్ కి చెందిన ఈ అమ్మాయి ప్రస్తుతం సాన్ ఫ్రాన్సిస్కో లో ఉంటుంది.
బాలనటిగా ఈమె ఇప్పటి వరకు మన తెలుగు లో బ్రహ్మోత్సవం, ప్రేమమ్ మరియు అజ్ఞాతవాసి వంటి చిత్రాల్లో నటించింది. అంతే కాదు కూచూపుడి , భరతనాట్యం వంటి క్లాసిక్ డ్యాన్స్ లో ప్రావిణ్యం సంపాదించిన అవంతిక జీ తెలుగు వారు నిర్వహించిన ‘డ్యాన్స్ ఇండియా డ్యాన్స్ లిటిల్ స్టార్స్’ అనే డ్యాన్స్ ప్రోగ్రాం లో అద్భుతమైన నృత్య ప్రదర్శనలు ఇచ్చి సెకండ్ ప్రైజ్ ని గెలుచుకుంది.
అంతే కాకుండా ఈమె ఫార్చ్యూన్ ఆయిల్ యాడ్ లో కూడా నటించింది. ఇందులో ఆమె ‘లైట్ గానే ఉంటుంది’ అని చెప్పిన డైలాగ్ బాగా ఫేమస్ అయ్యింది. ఇప్పుడు ఆమెకి 18 ఏళ్ళ వయస్సు. ఇంత చిన్న వయస్సులో ఆమె హాలీవుడ్ లో ఎప్పటికీ మర్చిపోలేని పాత్ర ఒకటి చేసింది. ప్రముఖ హాలీవుడ్ నిర్మాణ సంస్థ డిస్నీ స్టూడియోస్ సంస్థ 2022 వ సంవత్సరం లో ‘మీన్ గర్ల్స్’ అనే సినిమాని ప్రారంభించింది. రీసెంట్ గానే థియేటర్స్ లో విడుదలైన ఈ చిత్రానికి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.
ఇందులో అవంతిక ‘కరెన్ శెట్టి’ అనే పాత్ర పోషించింది. ఈ పాత్రకి హాలీవుడ్ క్రిటిక్స్ కూడా ఫిదా అయిపోయారు. ఈ సినిమా తర్వాత ఆమెకి టాలీవుడ్ లో మరికొన్ని క్రేజీ ప్రాజెక్ట్స్ వస్తున్నాయి. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ ఇమేజి లేకుండా తెలుగు అమ్మాయిగా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన అవంతిక నేడు హాలీవుడ్ స్థాయిలో గుర్తింపు ని తెచ్చుకోవడం మన తెలుగు జాతికి గర్వకారణం అంటూ సోషల్ మీడియా లో పోస్టులు పెడుతున్నారు నెటిజెన్స్.